Madanapalle: మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్య, ఆరోగ్య సిబ్బంది తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ సోమవారం ఆందోళన చేపట్టారు.
Posted 2026-09-01 05:37:06
0
82
మదనపల్లె: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్య, ఆరోగ్య సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని, ఉద్యోగి మృతి చెందిన సందర్భంలో రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఉద్యోగులకు ఈపీఎఫ్ సౌకర్యం, వేతనంతో కూడిన వైద్య సెలవులు, ఈహెచ్‌ఎస్ ఆరోగ్య కార్డులు అందించాలని కోరారు.
ఉద్యోగుల అభ్యర్థన మేరకు బదిలీలు, పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. “మేము సేవ చేస్తున్నాం.. మా హక్కులను కల్పించాలి” అంటూ నినాదాలు చేశారు. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Jammu & Kashmir Tourism Growth Driving Economic Progress
Jammu & Kashmir's tourism sector has experienced remarkable growth in 2026, contributing...
పుంగనూరు: కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ అధికారిగా యశ్వంత్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ...
మదనపల్లెలో పోలీసుల 'సండేస్ ఆన్ సైకిల్' ర్యాలీ.
కేంద్ర క్రీడా శాఖ 'ఫిట్ ఇండియా' ఉద్యమంలో భాగంగా, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు...
🛑 The Shadow of Statelessness: Illegal Deportations & Citizenship Rights in India
In a country built on the values of democracy, dignity, and constitutional...
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు: డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని బీజేపీ...