ఈటల సమక్షంలో బీజేపీలోకి చేరికలు.|

0
103

● ఈటల రాజేందర్ సమక్షంలో సుమారు 50 మంది చేరిక

● బోడుప్పల్ అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి పనిచేస్తామన్న నేతలు

● అవినీతి రహిత పాలన కోసం కృషి చేస్తామని వెల్లడి

అల్వాల్, ఆగస్టు 30: బోడుప్పల్ డివిజన్‌కు చెందిన పలువురు ప్రముఖులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు. శామీర్‌పేట్‌లోని ఎంపీ ఈటల రాజేందర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సమక్షంలో సుమారు 50 మంది బీజేపీ కండువా కప్పుకున్నారు.

బోడుప్పల్ డివిజన్‌కు చెందిన వై. సుధాకర్ రావు, బోడుప్పల్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వై. శ్రీనివాస్‌తో పాటు పలువురు పెద్దలు డివిజన్ అధ్యక్షుడు రవి యాదవ్, మాజీ కార్పొరేటర్ సామల పవన్ రెడ్డి, నందకుమార్ జోషి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా నూతనంగా చేరిన వారు మాట్లాడుతూ.. బోడుప్పల్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం, ప్రాంత అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమనే విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. అవినీతి రహిత పాలన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో ప్రజా సమస్యలకు తగిన ప్రాధాన్యం లభించలేదని వారు ఆరోపించారు. బోడుప్పల్‌లో అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం బీజేపీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి - ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి  ఈరోజు...
By Sidhu Maroju 2025-11-28 13:50:08 0 239
Andhra Pradesh
A. p capitl development and economy
రాజధాని, అభివృద్ధి & ఆర్థికంఅమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా చట్టబద్ధత కల్పించే...
By G k Nookala 2026-02-09 17:45:22 0 311
Andhra Pradesh
ఏఐఎస్ఎఫ్ ఉద్యమాలకు శ్రీకారం
ఎమ్మిగనూరు పట్టణంలో ప్రవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న దోపిడి పై సమరశీల పోరాటాలకు సిద్ధం...
By Boya Dasthagiri 2026-05-12 08:51:43 0 230
Andhra Pradesh
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ.
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ. మార్కాపురం జిల్లా కేంద్రంలో స్కానింగ్...
By Chennaiah Kati 2026-03-10 10:55:30 0 379
Andhra Pradesh
నాగులపాలెం వద్ద స్కూల్ రహదారి మూసివేతపై ఆందోళన – సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్
బాపట్ల జిల్లా: పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి–167...
By Gadiyapudi Narendra 2026-03-10 07:48:06 0 590
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com