డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ కి మంచి సువర్ణావకాశం

0
133

డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఉచిత సీఆర్‌టీ శిక్షణ: 

 

అప్‌టెక్ సొల్యూషన్స్ డైరెక్టర్ ఈడే లక్ష్మీపతి

 

 

విజయవాడ

 

(గవర్నర్‌పేట)

 

 

 డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగావకాశాలు మెరుగుపరిచేందుకు ఉచితంగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ (సీఆర్‌టీ) తరగతులను నిర్వహిస్తున్నట్లు అప్‌టెక్ సొల్యూషన్స్ డైరెక్టర్ ఈడే లక్ష్మీపతి వెల్లడించారు. 

 

 

విజయవాడ గవర్నర్‌పేట మహేశ్వరి ప్యాలెస్‌లోని అప్‌టెక్ సొల్యూషన్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మీ పతి మాట్లాడారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు మంచి విద్యార్హతలు కలిగినప్పటికీ, ఇంటర్వ్యూలలో సరైన నైపుణ్యాలు ప్రదర్శించలేక ఇన్ఫోసిస్, విప్రో, మహీంద్రా వంటి ప్రముఖ బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపి ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ఉచిత శిక్షణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రతి ఆదివారం, ఇతర ప్రభుత్వ సెలవు రోజుల్లో ఈ తరగతులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

హైదరాబాద్, పూణేలతో పాటు ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు, రంగానికి చెందిన నిపుణులతో ఈ కోర్సును ప్రత్యేకంగా రూపొందించినట్లు లక్ష్మీపతి వివరించారు. శిక్షణలో భాగంగా విద్యార్థులకు ఆప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, గ్రూప్ డిస్కషన్ (జీడీ), ఇంటర్వ్యూ ప్రిపరేషన్, రెజ్యూమ్ బిల్డింగ్ అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పిస్తామన్నారు. వీటితో పాటు నిరంతరం మాక్ టెస్టులు, నమూనా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ నియామక ప్రక్రియకు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.

ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని బి టెక్, డిగ్రీ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ కెరీర్‌ను సులభంగా నిర్మించుకోవాలని కోరారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు బ్యాచ్‌ల ఆధారంగా శిక్షణా సమయాలను కేటాయిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే 9177866999 నంబరులో సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Bharat Aawaz
Tribal Couple's Public Humiliation in Odisha: NHRC Demands Justice Under Articles 19 & 21
Location: Rayagada district, OdishaIncident: A shocking case of public humiliation of a tribal...
By Citizen Rights Council 2025-07-16 13:20:23 0 2K
Andhra Pradesh
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు మంగళసూత్రాలు విరాళం బహుమతి అందజేత
ప్రకటన  ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి బంగారు సూత్రాలు విరాళం  ...
By Rajini Kumari 2026-03-14 11:41:59 0 242
Telangana
నిజామాబాద్
ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది....
By Sadaq Sadaq 2026-05-16 01:39:13 0 126
Uttarkhand
Uttarakhand to Get AI-Enabled Healthcare Upgrades
In a major boost to Uttarakhand's medical infrastructure, the central government has approved the...
By Lokeshwari Panthadi 2026-06-30 07:28:05 0 78
Telangana
ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేయర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిసిసి కార్నర్ వద్ద *మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల...
By Pinnehasan Odela 2026-05-01 13:50:50 0 372
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com