ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ప్రారంభం..
Posted 2026-08-29 12:44:12
0
107
మంచిర్యాల నియోజకవర్గం :లక్షెట్టిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ప్రారంభించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను మెరుగైన వైద్యం అందించే ఆసుపత్రికి సురక్షితంగా తరలించేందుకు ఈ వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు..
పేద, సామాన్య ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ప్రజల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా కల్పిస్తుందని తెలిపారు..
అనంతరం హాస్పిటల్ ను సందర్శించి, వైద్యులతో మాట్లాడి పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు,ఈ కార్యక్రమంలో ప్రతిమ ఇన్స్టిట్యూట్ CEO రామచందర్రావు , ప్రతిమ హాస్పిటల్ క్రిటికల్ కేర్ డాక్టర్ ప్రవీణ్ గారు, లక్షెట్టిపేట్ ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్, డాక్టర్ శ్రీనివాస్ గారు, లక్షెట్టిపేట్ మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ , మంచిర్యాల జిల్లా RTA మెంబర్ అంకతి శ్రీనివాస్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, లక్షెట్టిపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరు రాజేశ్వరి - వెంకట స్వామి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, లక్షెట్టిపేట్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, మండల అధ్యక్షులు, సర్పంచ్ నలిమెల రాజు, సింగిల్ విండో చైర్మన్లు నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి , జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా నాయకులు పూర్ణచంద్రరావు, కార్పొరేటర్లు , కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Major Industrial Boost: Adani Group to Build Cement Plant in Guna
Madhya Pradesh’s industrial landscape is set for a massive upgrade following Chief Minister...
Challa Narayana: ఏపీ పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు.
మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌ల ద్వారా ఒంటరి, వితంతు మహిళల లక్ష్యంగా మోసం చేస్తున్న ఘరానా...
The Agentic AI Shift: Reforming India’s GCCs
Financial experts are sounding an alarm for India’s massive white-collar sector as Global...
నిజామాబాద్
మారని గ్యాస్ ఏజెన్సీ తీరు..మండల కేంద్రం లో ని నావిపేట్ మండలంలో భారత్ గ్యాస్ వద్ద బారులు తీరిన...
ఘనంగా 134 డివిజన్ కార్పొరేటర్ జన్మదిన వేడుకలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన...