మచ్చబొల్లారంలో మిలాద్ వేడుకలు.|

0
125

● ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

● మహమ్మద్ ప్రవక్త సందేశాలను గుర్తుచేసిన ఎమ్మెల్యే

● సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని పిలుపు

అల్వాల్, ఆగస్టు 26: మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్‌లో జష్న్-ఎ-మిలాద్-ఉన్-నబీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

స్థానిక  బిఆర్ఎస్ నాయకుడు మహమ్మద్ జావిద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ముస్లిం పెద్దలు, యువత ఆయనకు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముస్లిం సోదర సోదరీమణులకు జష్న్-ఎ-మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, సోదరభావం, మానవతా విలువలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.

కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యతతో మెలుగుతూ పరస్పర గౌరవంతో జీవించాలని ఆకాంక్షించారు. 

మల్కాజ్‌గిరి ప్రాంతం సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచేలా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మచ్చబొల్లారం మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, శోభన్ బాబు, భాస్కర్ రెడ్డి, అతిక్ పాషా, మహేష్, సురేష్, జనార్ధన్, సాజిద్, వెంకటేష్, గణేష్‌తో పాటు స్థానికులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర కార్యాలయం చైర్మన్ గారికి వినతి పత్రం
రాష్ట్రంలోని మైనారిటీ వక్ఫ్ బోర్డు ఆస్తులను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ...
By Rajini Kumari 2026-02-05 09:24:49 0 192
Andhra Pradesh
క్రీడాస్ఫూర్తితో విద్యార్థులు ఎదగాలి: చల్లపల్లి నరసింహరెడ్డి.
మదనపల్లె మండలం, గంగన్నగారిపల్లెలోని శ్రీ కృష్ణ చైతన్య ఫార్మసీ, నర్సింగ్ కళాశాలలో వార్షిక...
By Pagadala Venkateswar 2026-01-23 06:46:25 0 226
Andhra Pradesh
మదనపల్లి కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్.
77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-26 11:31:05 0 281
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లాకు అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనం. స్పాట్‌లోనే శాస్త్రీయ ఆధారాలు సేకరించేలా వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి.
మదనపల్లె: నేర పరిశోధనలో శాస్త్రీయ ఆధారాలను పక్కాగా సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్...
By Pagadala Venkateswar 2026-09-19 06:22:28 0 46
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె JP తేక్వొందో అకాడమీలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పోటీలను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ప్రారంభించారు.
మదనపల్లె, ఆగస్టు 2: మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువరిపల్లె మాయాబజార్‌లో గల జే పి తేక్వొందో...
By Pagadala Venkateswar 2026-08-03 09:48:06 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com