Madanapalle: మదనపల్లె JP తేక్వొందో అకాడమీలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పోటీలను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ప్రారంభించారు.

0
100

మదనపల్లె, ఆగస్టు 2: మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువరిపల్లె మాయాబజార్‌లో గల జే పి తేక్వొందో అకాడమీ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారుల్లో క్రమశిక్షణ, ఆత్మరక్షణ నైపుణ్యాలు, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో కరాటే, తేక్వొందో వంటి యుద్ధకళలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. విద్యతో పాటు ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడలో ప్రావీణ్యం సాధించాలని, క్రీడలు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పోరాట స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. స్వర్గీయ పి. జయకుమార్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన తనయుడు పి. విఘ్నేశ్, శివకుమార్, గంగరాజు చిన్నారులకు అందిస్తున్న శిక్షణను శ్రీరామ్ చినబాబు అభినందించారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజయ్, మోటివేషనల్ స్పీకర్ డి.జి. రామమూర్తి, బీజేపీ యువ నాయకుడు సింహం శ్రీకాంత్, అకాడమీ శిక్షకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
Hyderabad Metro and Urban Infrastructure Drive Progress
Hyderabad continues to strengthen its urban infrastructure through the expansion of Metro Rail...
By Fathima Safa 2026-07-06 05:56:50 0 205
Telangana
హైడ్రా కార్యాలయం ముందు డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసన
సికింద్రాబాద్ :బుద్దభవన్.   హైడ్రా కార్యాలయం ముందు హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసన....
By Sidhu Maroju 2025-09-17 08:31:40 0 324
Telangana
"ఈటల చేతుల మీదుగా మోదీ సభ పోస్టర్ల ఆవిష్కరణ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేతుల మీదుగా మే...
By Sidhu Maroju 2026-05-06 06:47:28 0 416
Bihar
CM Walks to Office in Major Fuel-Saving Drive
Patna: In a striking display of austerity, Bihar Chief Minister Samrat Choudhary walked 500...
By Dunna Jessicaruth 2026-05-16 05:27:31 0 122
Telangana
అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజ్‌గిరి శాసనసభ్యులు, మర్రి రాజశేఖర్ రెడ్డి భారత...
By Sidhu Maroju 2025-12-06 12:20:57 0 328
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com