పోలవరం వద్ద గోదావరికి పోటెత్తుతున్న వరద.. 48 గేట్లు ఎత్తివేత.

0
83

 

రెండు, మూడు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు

పోలవరం ప్రాజెక్ట్ కాఫర్ డ్యామ్ వద్ద 30.30 మీటర్లకు చేరుకున్న గోదావరి నీటిమట్టం

4.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు

గత రెండు, మూడు రోజులుగా తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాలలో పడుతున్న భారీ వర్షాల వల్ల గోదావరి నదిలోకి వరద నీరు పోటెత్తుతుంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ప్రవాహం తీవ్రతరమైంది. ప్రాజెక్టు పరిధిలోని ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద గోదావరి నీటిమట్టం 30.30 మీటర్లకు చేరుకోగా, స్పిల్ వే వద్ద నీటిమట్టం 30.20 మీటర్లుగా నమోదైంది. వరద నీటిని క్రమబద్ధీకరించేందుకు అధికారులు స్పిల్ వేకు చెందిన 48 గేట్లను ఎత్తివేసి, దిగువకు 4.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

 

 

గోదావరి వరద ప్రభావంతో దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ గండిపోశమ్మ ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లు, చుట్టుపక్కల ఉన్న దుకాణాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. పి.గొందూరు నుంచి నాగులపల్లి గ్రామాల మధ్య రహదారిపైకి వరద నీరు చేరుకోవడంతో అమ్మవారి ఆలయానికి వెళ్లే దారిలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నదిలో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున, పర్యాటకుల భద్రత దృష్ట్యా పాపికొండల విహారయాత్రకు వెళ్లే బోట్ల రాకపోకలను నిలిపివేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్యన చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు
తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్యన వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని...
By Pinnehasan Odela 2026-01-15 14:40:44 0 278
Telangana
త్వరలో అందుబాటులోకి అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను బుధవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-10-08 11:20:10 0 283
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : పుంగునూరు రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి
పుంగనూరు నియోజకవర్గం, కల్లూరు బంగ్లా వద్ద రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కరిముల్లా ఆధ్వర్యంలో...
By Kothuru Murali 2026-02-15 07:11:55 0 213
SURAKSHA
Ms. Chanchal Yadav: Transforming Island Governance
A dynamic 2008-batch AGMUT cadre IAS officer, Ms. Chanchal Yadav is leading key development...
By Lokeshwari Panthadi 2026-07-24 04:33:01 0 198
Telangana
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్యయిష సంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...
By Sadaq Sadaq 2026-03-02 14:26:05 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com