రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఆసిఫాబాద్ విద్యార్థులు ఎంపిక ప్రిన్సిపల్ దుర్గం మహేశ్వర్ అభినందనలు

0
413

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలలో ఈ నెల 20న నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో స్థానిక తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని భారతి 400 మీటర్ల పరుగు పందెంలోనూ, నిఖిలేష్ షాట్‌పుట్ విభాగంలోనూ తమ అత్యుత్తమ ప్రదర్శనతో రాణించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ క్రీడాకారులు ఈ నెల 26, 27 తేదీలలో హనుమకొండ జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో జిల్లా తరపున పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయికి ఎంపికై జిల్లా కీర్తిని చాటిన విద్యార్థులను ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ దుర్గం మహేశ్వర్, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించి, రాబోయే పోటీల్లో కూడా విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరీక్షణ బాబుగారు....
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ...
By Chennaiah Kati 2026-02-02 06:53:09 0 404
Andhra Pradesh
అంబటి రాంబాబు బెయిల్‌ పిటీషన్‌పై నేడు వాదనలు.
గుంటూరు లీగల్‌: మాజీ మంత్రి, వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు,...
By John Baji 2026-02-05 05:39:13 0 587
Andhra Pradesh
రాయలసీమలో రైతుల ఇబ్బందులు: వర్షం తక్కువ, ధరలు కుదిరలేక |
రాయలసీమలో రైతుల ఇబ్బందులు: వర్షం తక్కువ, ధరలు కుదిరలేక రాయలసీమ ప్రాంతంలో వర్షాలు తక్కువగా పడటంతో...
By Bharat Aawaz 2025-09-20 10:43:35 0 1K
Telangana
హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా వసూల్ రాజా..
పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్.. ‎హరీష్ రావును...
By Ponnala Srinivasrao 2026-04-01 03:44:33 0 244
Andhra Pradesh
మదనపల్లె: ఘనంగా రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం - ఫోర్డ్ సంస్థ.
మదనపల్లె జూనియర్ కళాశాలలో ఫోర్డ్ సంస్థ ఆధ్వర్యంలో రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం నిర్వహించారు....
By Pagadala Venkateswar 2026-05-29 05:25:19 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com