ఆదివాసీలకు 100% ఉద్యోగాల రిజర్వేషన్ పై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలి ఆదివాసి గిరిజన సంఘం: చింతూరు

0
160

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు 2024 ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఆదివాసి ప్రజానీకానికి 100% ఉద్యోగ రిజర్వేషన్ చట్టం బద్ధత కల్పించి ఆదివాసి లకు న్యాయం చేస్తానన్న హామీని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించి ఆదివాసీల న్యాయం చేయాలని 1/ 70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టు లో ఇంప్లిట్ పిటిషన్ దాఖలు చేసి ఆదివాసీల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని కోరుతూ ఒకరోజు నిరాహార దీక్షలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చింతూరు మండల తాసిల్ధర్ కార్యాలయం ముందు ఒకరోజు నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆదివాసి సీనియర్ ఉపాధ్యాయులు పండ కృష్ణయ్య, ఆదివాసి మహిళ నాయకురాలు కారం సంకురమ్మ సిఐటియు మండల కార్యదర్శి పోడియం లక్ష్మణ్ ప్రారంభించిన ఈ సందర్భంగా పండ కృష్ణయ్య మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగబద్ధంగా ఆదివాసీలకు హక్కులు కల్పించబడ్డాయని అందులో భాగంగానే జీవో నెంబర్ 3 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించబడిందని గతంలోని ప్రభుత్వాలు ఆదివాసీలు పక్షాన నిలబడి జీవో నెంబర్ 3 రక్షణ పై శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే 2020లో 100% ఉద్యోగ రిజర్వేషన్ రద్దయిందని 100% ఉద్యోగ రిజర్వేషన్ సాధన కోసం ఆదివాసులు ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు సిసం సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా ఆదివాసులకు 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించడం ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రథమ బాధ్యత అని ప్రకటనలు చేసి ఏజెన్సీ ప్రాంత ప్రజానీకం ఓట్లు దండుకొని రెండేళ్ల కాలంగా ఉన్నత స్థాయి కమిటీల పేరుతో న్యాయ సమీక్షల పేరుతో కాలయాపన చేస్తూ ఆదివాసీలకు ద్రోహం చేస్తున్నారని ఈనాడు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఖనిజా సంపద భూములపై కన్ను పడిందని ఆదివాసి మనుగడని ధ్వంసం చేసే1/70 సవర్ణ చేపట్టాలని సుప్రీంకోర్టులో గిరిజనేతరులతో పిటిషన్లు ప్రభుత్వం వేయించిందని విమర్శించారు తక్షణమే వన్ ఆఫ్ సెవెంటీ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిట్ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు, ఆదివాసీల ప్రజానీకం శ్రేయస్సుకోసం పని చేస్తున్న పని బాలు పలుకుతున్న ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆదివాసీల శ్రేయోభిలాషిగా తన విశ్వ నియతను ప్రదర్శించాలని తక్షణమే తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆదివాసీలో ఐక్య పోరాటాల ద్వారానే ఆదివాసి హక్కులు రక్షించబడతాయి దీక్షలకు సంఘీభావంగా ఆదివాసి జేఏసీ ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు. ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అసెంబ్లీలో 100% ఉద్యోగ రిజర్వేషన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించి ఆదివాసులకు న్యాయం చేయాలని జరుగుతున్న న్యాయమైన పోరాటానికి చింతూరు ఆదివాసి జేఏసీ నాయకులు జల్లి నరేష్ పొడియం రామకృష్ణ, కాకా సీతారామయ్య మడివి రాజు, సాయిబాబు, పొడియం లక్ష్మణ్, మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హక్కులు రక్షణ చేపట్టాలంటే రాజకీయాలకు అతీతంగా ఆదివాసీలు ఏకతాటిపై వచ్చి హక్కులు రక్షణ కోసం పోరాటాలకు రావాలని యువత పోరాటాలకు సమయం కావాలని ఆదివాసీల హక్కుల కోసం పోరాటాలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల నాయకులు మల్లం సుబ్బమ్మ,ముట్టం రాజయ్య, మడకం చిన్నయ్య, సోడే లెనిన్, గుర్రం పిడకయ్య, మడకం కన్నయ్య, బడుగు కిట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:57 0 73
Telangana
కడెం ; గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులకు ఆహ్వానం
తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షకు 5 తరగతి నుంచి 9 వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కడెం...
By Mittapelli Saketh 2025-12-23 09:37:21 0 1K
Maharashtra
Fake Nashik Kumbh Mela Jobs: Cyber Police Alert Issued
The Nashik Cyber Police have officially registered a criminal case against unknown perpetrators...
By Lokeshwari Panthadi 2026-06-27 06:35:25 0 120
Andhra Pradesh
విశాఖ లో లోకా యుక్త శిబిరం
ఈ నెల 29.30 తే ది ల లోకా యుక్త ఉచిత శిబిరం విశాఖలో   నిర్వ హి స్థూన్నా మ నీ  లో కా...
By Mobbu Venkatramana 2026-01-18 14:57:08 0 691
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com