ఓటు హక్కు పరిరక్షణపై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే శ్రీగణేష్.|

0
142

● బిఎల్ఏల సేవలను అభినందించిన ఎమ్మెల్యే

● ప్రతి అర్హుడి ఓటును కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచన

● తుది ప్రక్రియ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా వ్యవహరించాలని పిలుపు

మేడ్చల్ మల్కాజ్గిరి, ఆగస్టు 19: కంటోన్మెంట్ నియోజకవర్గంలో చేపట్టిన ఎస్ఐఆర్ (ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియపై ఎమ్మెల్యే శ్రీగణేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రక్రియలో క్రియాశీలకంగా పనిచేసిన బూత్ లెవల్ ఏజెంట్ల (బిఎల్ఏ)తో సమావేశమైన ఆయన, వారి సేవలను అభినందించారు.

ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడంలో బిఎల్ఏలు ఎంతో కష్టపడి పనిచేశారని ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు హక్కును కాపాడటంతో పాటు, అర్హులైన వారి పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేయించేందుకు వారు చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

అన్‌మ్యాప్డ్ ఓటర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నోటీసులు అందుకున్న ఓటర్ల వివరాలను తప్పనిసరిగా సమర్పించేలా చూడాలని బిఎల్ఏలకు సూచించారు. 

ప్రతి అర్హుడి ఓటును కాపాడేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ ప్రాథమికంగా పూర్తయినప్పటికీ, మొత్తం ప్రక్రియ తుది దశకు చేరుకునే వరకు నాయకులు, బిఎల్ఏలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ జాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంటోన్మెంట్ ఎస్ఐఆర్ పీసీసీ కో-ఆర్డినేటర్ సత్యారెడ్డి, నియోజకవర్గ ఎస్ఐఆర్ కో-ఆర్డినేటర్లు బద్రినాధ్ యాదవ్, సంకి రవీందర్, వివిధ వార్డుల అధ్యక్షులు, మహిళా నాయకులు, బిఎల్ఏలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
ఆధార్ కార్డు,రేషన్ కార్డులు,ఇంటి స్థలాలు లేని యానాదులను గుర్తించాలి...... జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
చెరుకుపల్లి: జిల్లాలో ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ఇంటి స్థలాలు లేని యానాది కుటుంబాలను గుర్తించాలని...
By Gadiyapudi Narendra 2026-02-12 12:54:39 0 299
Andhra Pradesh
సంక్రాంతి సంబరాలు మరువలేని తీపి జ్ఞాపకాలు
*ప్ర‌చుర‌ణార్థం* *16-01-2026*   ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ జిల్లా మొత్తం పండుగ...
By Rajini Kumari 2026-01-16 12:38:34 0 229
Andhra Pradesh
కుమార్తె రాజకీయ అరంగేట్రంపై బొత్స కీలక ప్రకటన
తన కుమార్తె అనూషను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు....
By Boiena Rajesh 2026-08-19 13:13:15 0 106
SURAKSHA
Gurpreet Kaur Deo, IPS: A Trailblazer in Police Leadership
A distinguished 1993-batch Punjab Cadre IPS officer, Gurpreet Kaur Deo has broken barriers...
By Lokeshwari Panthadi 2026-07-17 11:49:11 0 341
Chhattisgarh
Chhattisgarh Advances Urban Development and Smart Growth
Chhattisgarh is accelerating urban development through investments in smart infrastructure,...
By Fathima Safa 2026-07-01 09:41:35 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com