ఘనంగా భాగ్యలక్ష్మి పౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు.ఈ సందర్భంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకుల పంపిణీ.

0
1K

జగద్గిరిగుట్ట: భాగ్యలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు బుధవారం ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగద్గిరిగుట్ట ఏఎస్ఐ నన్నేమియా హాజరయ్యారు. జన్మదినం సందర్భంగా మాణిక్య చారి తన వంతు సహాయంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకులను, అలాగే మానసిక వికలాంగుడికి ఒక సంవత్సరం సరిపడా డైపర్స్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన జన్మదిన వేడుకల సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రంలో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, అశోక సంఘం అధ్యక్షులు ఏసుబాబు, మదర్ తెరిసా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, రమ, విజయ్ శంకర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Telangana
వాతావరణం దెబ్బకు 3 విమానాలు విజయవాడకు మళ్లింపు |
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హైదరాబాద్ నుండి బయలుదేరాల్సిన మూడు ఇండిగో విమానాలను విజయవాడకు...
By Bhuvaneswari Shanaga 2025-09-26 13:22:04 0 50
Andhra Pradesh
భారత్ క్వాంటం కంప్యూటింగ్ క్లబ్ చేరే దిశలో |
భారత దేశం క్వాంటం కంప్యూటింగ్ రంగంలో గణనీయమైన పురోగతులు సాధిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
By Bhuvaneswari Shanaga 2025-09-23 06:48:05 0 30
Telangana
రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్ : స్పందించిన డిజిపి
హైదరాబాద్:  రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-10-20 08:20:14 0 100
Telangana
కాంగ్రెస్, BJP నుంచి BRSలోకి నేతల ప్రవాహం |
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, BRS పార్టీకి అనూహ్యంగా బలమైన వలసలు...
By Bhuvaneswari Shanaga 2025-09-30 07:26:22 0 30
Andhra Pradesh
APCRDAపై ₹200 కోట్ల పన్ను డిమాండ్‌ కలకలం |
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA)పై ఆదాయపు పన్ను శాఖ ₹200 కోట్ల పన్ను...
By Deepika Doku 2025-10-11 09:31:05 0 107
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com