కలెక్టర్, ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సమీక్షించిన ఆదిలాబాద్ ఎంపీ

0
209

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): కుమురం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు నమ్మకమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేశ్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (HDCS) సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మిలతో కలిసి ఆసుపత్రిలో అందుతున్న సేవలు, వసతులపై ఎంపీ సుదీర్ఘంగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది మానవత్వంతో, మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. విధుల్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన సమయపాలన పాటించాలన్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా బ్లడ్ బ్యాంక్, అంబులెన్స్ సేవలను నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వీటితో పాటు ఎక్స్రే, స్కానింగ్ వంటి కీలకమైన వైద్య పరికరాలు ఎల్లప్పుడూ పని చేసేలా చూడాలని, పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ వైద్యం అందడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Jammu & Kashmir
Reviving Mohra: Modernizing India’s Heritage Power Plant
The heritage Mohra Hydroelectric Power Project, established in the early 1900s as one of India's...
By Lokeshwari Panthadi 2026-06-29 09:39:09 0 114
Andhra Pradesh
మైనారిటీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన_తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా.
ఈరోజు గుంటూరు నగర మరియు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మైనారిటీ నాయకులతో విస్తృత...
By John Baji 2026-01-21 10:58:11 0 265
Telangana
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / కంటోన్మెంట్.     కంటోన్మెంట్ నియోజకవర్గంలో 62 మంది...
By Sidhu Maroju 2025-08-08 18:34:20 0 843
Telangana
Janagana 2027 start today
జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) లో పాల్గొని...
By G k Nookala 2026-04-26 11:01:53 0 194
Telangana
మొయినాబాద్: ఈ ఏరియాల్లో నేడు కరెంట్ బంద్
హైదరాబాద్- బీజాపూర్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాల తొలగింపు కారణంగా నేడు విద్యుత్...
By Veeresh Kumar 2026-04-01 02:12:44 0 769
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com