వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు

0
1K

సైబరాబాద్‌(Cyberabad) పరిధిలోని పలు స్టార్‌ హోటళ్లు హైటెక్‌ వ్యభిచారానికి అడ్డాగా మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దేశ విదేశాల నుంచి యువతులను అక్రమ రవాణా చేసి, ఆన్‌లైన్‌లో, వాట్సా్‌పలో కస్టమర్లను ఆకర్షించి హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు సైబరాబాద్‌ పోలీసులు. ఢిల్లీ(Delhi)కి చెందిన ఇద్దరు యువతులతో పాటు, విదేశాలకు చెందిన మరో యువతిని రక్షించి హోమ్‌కు తరలించారు. విటుడిని మాదాపూర్‌ పోలీస్‏స్టేషన్‌(Madhapur Police Station)కు తరలించారు. పోలీసులు వివరాలు గోప్యంగా ఉంచడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలో ఉంటూ నగరంలో హైటెక్‌ సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్న ప్రధాన ఆర్గనైజర్‌ సుమిత్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతనికోసం ప్రత్యేక పోలీస్‌ బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం.

కోల్‌కతాకు చెందిన సుమిత్‌ కొన్నేళ్లుగా మెట్రోపాలిటన్‌ నగరాల్లోని స్టార్‌ హోటళ్లను అడ్డాగా చేసుకొని హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దేశ, విదేశాలకు చెందిన యువతులను ఉద్యోగాల పేరుతో నగరానికి రప్పించి ఈ ఊబిలోకి దింపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారికి రోజుకు వేలల్లో డబ్బులు ఇచ్చి మెల్లగా పొడుపు వృత్తిలోకి దింపుతున్నారు. ఆన్‌లైన్‌లో యువతులను ఫొటోలను పెట్టి, విటులను ఆకర్శించి దందాను నిర్వహిస్తున్నారు.

మాదాపూర్‌ పరిధిలోని ఒక హోటల్‌పై దాడి చేసిన సైబరాబాద్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ పోలీసులు ముఠా గుట్టు రట్టు చేశారు. రాజస్థాన్‌(Rajasthan)కు చెందిన ప్రధాన నిందితుడు సుమిత్‌ పశ్చిమబెంగాల్‌లో ఉంటూ, నగరంలో తన అనుచరుల ద్వారా ఈ దందా నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. అతడిని అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా అతిపెద్ద సెక్స్‌ రాకెట్‌ ముఠా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సైబరాబాద్‌ పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉచిత బస్సు పథకం.. ఇకపై ఆధార్ కార్డ్ లేకుండా టికెట్
ఉచిత బస్సు పథకం.. ఇకపై ఆధార్ కార్డ్ లేకుండా టికెట్ AP: మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డ్...
By Gadiyapudi Narendra 2025-12-30 17:30:13 0 291
Andhra Pradesh
Ajit Pawar: అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం.
Ajit Pawar: అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం 28-01-2026 Wed 13:13 | Andhra Ajit Pawar...
By Pagadala Venkateswar 2026-01-28 10:29:38 0 110
Andhra Pradesh
అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టా? వాస్తవాలు - అపోహలు....
సమాజంలో జరిగే విషయాలను సేకరించి, విశ్లేషించి ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రతి వ్యక్తీ జర్నలిస్టే....
By Gadiyapudi Narendra 2026-03-03 05:44:11 0 187
Andhra Pradesh
17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ పదవీకాలం ముగియడంతో మంగళవారం ఆయనను వారు ఘనంగా సన్మానించిన ప్రజలు
చీరాల: చీరాల 17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ ఆధ్వర్యంలో తమ వార్డు ఎంతగానో...
By Gadiyapudi Narendra 2026-03-17 06:45:53 0 407
Andhra Pradesh
పుంగనూరు: బక్రీద్ పండుగ సందర్భంగా పొట్టేలుకు భలే గిరాకి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో గురువారం జరిగిన వారపు సంతలో పొట్టేళ్లు భారీగా తరలివచ్చాయి....
By Kothuru Murali 2026-05-21 16:54:59 0 30
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com