బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు అలర్ట్.

0
80

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయవ్య బంగాళాఖాతంలో, ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో కేంద్రీకృతమైన ఈ వ్యవస్థ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రానున్న నాలుగైదు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తరాంధ్ర తీర ప్రాంతానికి హెచ్చరికలు జారీ చేసింది.

 

తీవ్ర అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వెళ్లినవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని అధికారులు సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సూర్యోదయ సంస్థ సేవా స్ఫూర్తి – పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్ల పంపిణీ
కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు ప్రభుత్వ హైస్కూల్లో సూర్యోదయ సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి...
By Ratna Sekhar 2026-03-08 17:28:01 0 812
Andhra Pradesh
) అనంత: మరదలితో ప్రేమ.. సుత్తితో కొట్టి చంపిన బావ
అనంత: మరదలితో ప్రేమ.. సుత్తితో కొట్టి చంపిన బావ హైదరాబాద్ జగద్గిరిగుట్ట శ్రీరామ్ నగర్లో గురువారం...
By Eslavath RameshNaik 2026-01-17 02:09:56 0 286
Andhra Pradesh
ప్రభుత్వ చలివేంద్రాలు ప్రచార ఆర్భాటమే: సిపిఎం విమర్శ.
మదనపల్లెలో ప్రభుత్వ చలివేంద్రాలు కేవలం ప్రచార ఆర్భాటంగానే మారాయని సీపీఎం జిల్లా కార్యదర్శి పి....
By Pagadala Venkateswar 2026-05-18 04:22:14 0 111
Goa
Man Found Unconscious on Bike Near Verna Bypass; Delay in Emergency Response Sparks Concern
Man Found Unconscious on Bike Near Verna Bypass; Delay in Emergency Response Sparks Concern...
By BMA ADMIN 2025-05-21 09:40:47 0 2K
Telangana
శ్రీనివాస్ కుటుంబానికి అండగా DTF
మహబూబాబాద్/కొత్తగూడ:: సర్పంచ్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బ్రెయిన్...
By Bheeshman King 2026-04-11 12:43:41 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com