ఆసిఫాబాద్‌కు రేపు మంత్రి జూపల్లి

0
185

🎤భారత్ ఆవాజ్ న్యూస్ ఆసిఫాబాద్ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 17, 18వ తేదీల్లో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సంస్కృతి, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. 17న కాగజ్‌నగర్‌లో బస చేయనున్న మంత్రి.. 18న సిర్పూర్(టి)లో జరిగే 'సిర్' అవగాహన కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం వాంకిడి మండలం 14/800 కిలోమీటర్ల వద్ద రూ.8.50 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తారు. ఆసిఫాబాద్ ఐడీఓసీలో కుట్టుమిషన్లు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేయనున్నారు.ఈ పర్యటన షెడ్యూల్ ప్రకారం 17వ తేదీ ఉదయం 06:00 గంటలకు గౌరవ మంత్రి గారు హైదరాబాద్‌లోని తమ నివాసం నుండి రోడ్డు మార్గాన జాతీయ రహదారి 44 ద్వారా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ వైపు బయలుదేరుతారు. ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు ఉట్నూర్‌లోని గాదం నాచిరెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించే అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 05:00 గంటలకు ఉట్నూర్ నుండి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని SPM గెస్ట్ హౌస్ వైపు బయలుదేరి, రాత్రి 07:00 గంటలకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.తదుపరి రోజు 18వ తేదీ ఉదయం 09:20 గంటలకు కాగజ్‌నగర్ లోని SPM గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి, ఉదయం 09:30 నుండి 11:30 వరకు కాగజ్‌నగర్‌లోని రన్ గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్‌లో జరిగే సిర్పూర్ (టి) నియోజకవర్గ అవగాహన సమావేశానికి హాజరవుతారు అనంతరం మధ్యాహ్నం 12:00 గంటలకు వాంకిడి మండలంలో వాంకిడి నుండి కాగజ్‌నగర్ వెళ్లే రోడ్డుపై 14/800 కిలోమీటర్ల వద్ద రూ. 8.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:55 నుండి 01:45 వరకు ఆసిఫాబాద్ జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో జరిగే కార్యక్రమాలకు హాజరై, ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కింద లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ మరియు ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత కింద లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేస్తారు. చివరగా మధ్యాహ్నం 01:45 గంటలకు ఆసిఫాబాద్ ఐడీఓసీ సమావేశ మందిరం నుండి బయలుదేరి రెబ్బెన మండలం గోలేటి గెస్ట్ హౌస్ వైపు ప్రయాణమవుతారు.

Search
Categories
Read More
Telangana
మజ్జిగ మరియు ఓరేస్ ప్యాకెట్లు పంపిణీ గ్రామ సర్పంచ్...
మర్రిపల్లి/దుగ్గొండి    మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించిన గ్రామ సర్పంచ్ డ్యాగం...
By Gujile Ramu 2026-06-03 07:40:23 0 199
Telangana
భద్రాచలం లో ఉత్తరా ద్వారా దర్శనం
భద్రాచలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠ ఏకాదశి సందర్భంగా. ఉత్తర ద్వారా దర్శనం నిర్వహిస్తోంది....
By Karapati Gopi 2025-12-30 01:19:10 0 328
SURAKSHA
Shikha Goel: The Shield of Integrity Reshaping Modern Law Enforcement
 Shikha goel ips The Shield of Integrity: How IPS Shikha Goel is Reshaping Modern Law...
By Kalaga Sailaja 2026-07-11 12:53:15 0 256
Andhra Pradesh
పుంగనూరు RTC బస్టాండ్‌కు ఆర్యవైశ్య సంఘం వాటర్ కూలర్ విరాళం కొత్తూరు మురళి
పుంగనూరు RTC బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కె. బాలసుబ్రమణ్యం,...
By Kothuru Murali 2026-05-27 14:46:05 0 115
SURAKSHA
Securing Our Shores: Lakshadweep’s Coastal Defense System
Lakshadweep’s unique island geography demands a highly specialized approach to maritime...
By Lokeshwari Panthadi 2026-07-03 07:51:35 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com