నిజామాబాద్

0
123

నిజామాబాద్ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.|ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు.నిజామాబాద్: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకు.ని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.మొదట ఎల్లమ్మగుట్టలోని BRS పార్టీ జిల్లా కార్యాలయంలో, BRS పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ జీవన్ రెడ్డి గారితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం RR చౌరస్తా శివాజీ చౌక్‌లో సిర్ప రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

అలాగే జూబ్లీ హోటల్ చౌరస్తా, ఖిల్లా రోడ్‌లో BRS నాయకులు అబ్దుల్ మతీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. 58వ డివిజన్ అధ్యక్షులు సమీ ఆధ్వర్యంలో దారుగల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం 15వ డివిజన్ BRS నాయకులు ముస్తాక్ ఆధ్వర్యంలో నిజాం కాలనీ మెయిన్ రోడ్, అర్సపల్లిలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను కూడా మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.  

Search
Categories
Read More
Telangana
బాచుపల్లి ఫ్లైఓవర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 8 న అధికారికంగా ప్రారంభం
హైదరాబాద్‌లోని బాచుపల్లి జంక్షన్‌ వద్ద సుమారు రూ. 141 కోట్ల వ్యయంతో నిర్మించిన 6 లేన్ల,...
By Ponnala Srinivasrao 2026-06-05 14:48:58 0 167
Telangana
యూపీఎస్ స్కూల్‌లో యాంటీ డ్రగ్స్ కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు ...
By Sidhu Maroju 2026-06-24 08:31:09 0 148
SURAKSHA
Sadanand Date: Leading Maharashtra Police With Courage
From displaying extraordinary bravery during the 26/11 Mumbai terror attacks to leading...
By Lokeshwari Panthadi 2026-07-30 12:34:10 0 170
Andhra Pradesh
ఆర్పీలకు రూ. 24 వేల జీతం ఇవ్వాలంటూ నిరసన.
మదనపల్లె కలెక్టరేట్ ఎదుట సోమవారం రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీలు) నిరసన ధర్నా చేపట్టారు. మున్సిపల్...
By Pagadala Venkateswar 2026-04-13 12:44:28 0 188
Jammu & Kashmir
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower Corruption Case
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower...
By BMA ADMIN 2025-05-23 10:02:15 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com