పేద మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం : బండి రమేష్

0
158

కూకట్పల్లి 9 ఫేజ్ గోకుల్ ప్లాట్స్ వద్ద కట్టబోయే ఇందిరమ్మ టవర్ ల శంకుస్థాపనకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రానుండటంతో, కార్యక్రమ ఏర్పాట్లను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ అరెకపూడి గాంధీ గారితో కలసి టిపిసిసి ఉపాధ్యక్షులు,కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ గారు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రమేష్ గారు మాట్లాడుతూ ఇంత విలువైన భూమిని నామమాత్రపు ధరతో పేదలకు,మద్యతరగతి వారికి ఇల్లుకట్టి అందించటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. హైదరాబాద్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో 807 కోట్ల అంచనాలతో పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని చెప్పారు.ఒక్కో ప్లాటుకు ప్రభుత్వం 5 లక్షల సబ్సిడీ అందిస్తుందని,లబ్ధిదారుని వాటా 6 లక్షలు చెల్లించాలని, కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలు మించని వారు దరఖాస్తు చేసువాలని, నిబంధనలు, విధి విధానాలు తెల్సుకొని మీ- సేవాకేంద్రాలు, 8096958096 వాట్సాప్ సర్వీసుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ ఆగష్టు 15 అని, ఈ లోగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం మొదట మన నియోజకవర్గం తోనే శ్రీకారం చుట్టినందుకు ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బండి రమేష్ గారు కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, తూము వేణు, దినేష్ కుమార్, సాయిబాబు చౌదరి, రంగమోహన్, వినోద్, శంకర్ ,రాజేష్, కిల్లరి శ్రీనివాస్, చావా శ్రీనివాస్, గోపాల్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు .

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి వేడుకలు జనసేన కార్యాలయం భవానిపురం లో ఘనంగా నిర్వహించారు
విజయవాడ, NTR జిల్లా,  భవానిపురం    స్వతంత్ర సమరయోధుడు ,ఆమరజీవి పొట్టి...
By Rajini Kumari 2025-12-15 11:05:34 0 258
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో పారదర్శకంగా పోస్టుల భర్తీ ప్రక్రియ
కూటమి ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో పారదర్శకంగా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టడమే కాకుండా, మా...
By SivaNagendra Annapareddy 2025-12-22 13:10:20 0 881
Andhra Pradesh
దుర్గ గుడికి లక్ష విరాళం
*దుర్గగుడి అభివృద్ధికి లక్ష విరాళం*     విశాఖపట్నంలోని మాధురవాడకు చెందిన వంగపండు...
By Rajini Kumari 2025-12-31 10:19:50 0 248
Andhra Pradesh
నిమ్మనపల్లె: పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రతిభకు ప్రశంసాపత్రం.
నిమ్మనపల్లె మండలంలోని రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి గాయత్రి గ్రామ పరిపాలన, పారిశుద్ధ్య...
By Pagadala Venkateswar 2026-06-26 03:17:46 0 103
Telangana
హైడ్రాకు సుప్రీం షాక్.|
● 40 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ● హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత...
By Sidhu Maroju 2026-09-15 09:01:16 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com