Madanapalle: మదనపల్లె నీరుగట్టువారిపల్లి నీటి సమస్య తీర్చేందుకు హంద్రీనీవా కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష. అమ్మచెరువుకు నీటి మళ్లింపుపై కసరత్తు.

0
97

మదనపల్లె: నీరుగట్టువారిపల్లి ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష చర్యలు చేపట్టారు.

 

ఇందులో భాగంగా హంద్రీనీవా కాలువను పరిశీలించి, కాలువ ద్వారా వచ్చే నీటిని అమ్మచెరువుకు మళ్లించే అవకాశాలను ఎమ్మెల్యే పరిశీలించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ మరో రెండు, మూడు నెలల పాటు హంద్రీనీవా కాలువలో నీరు వచ్చే అవకాశం ఉందన్నారు.

 

ఈ నీటిని అమ్మచెరువులోకి మళ్లించి, మదనపల్లె 34, 35వ వార్డు, కోళ్లబైలు గ్రామపంచాయతీ1,2 పరిధిలోని ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేయడమే లక్ష్యమని తెలిపారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

 

ఎమ్మెల్యేతో పాటు కోళ్లబైలు ఇన్‌చార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు, 34 వార్డ్ ఇంచార్జ్ బాలమలి శేఖర్, 35వ వార్డు ఇన్‌చార్జ్ స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి, మోహన్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu: ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ: సీఎం చంద్రబాబు.
Chandrababu: ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ: సీఎం   andhra Chandrababu reviews...
By Pagadala Venkateswar 2026-02-04 07:57:42 0 224
Andhra Pradesh
అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్.
అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్ 30-04-2026 Thu 22:42 | Andhra Nara Lokesh...
By Pagadala Venkateswar 2026-05-01 04:18:37 0 130
Andhra Pradesh
మజ్జిగ పంపిణీ చేసిన గద్దె క్రాంతి కుమార్
*సేవే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందడుగు*   *మజ్జిగ పంపిణీ చేసిన గద్దె క్రాంతి కుమార్,...
By Rajini Kumari 2026-05-08 13:27:46 0 146
Telangana
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (51) కన్నుమూశారు. గత కొద్ది...
By Ponnala Srinivasrao 2026-07-31 02:15:05 0 150
Telangana
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఈటల, మల్లారెడ్డి.. కారణం ?
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ డంపింగ్‌ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని సీఎం...
By Ponnala Srinivasrao 2026-05-05 01:44:39 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com