మజ్జిగ పంపిణీ చేసిన గద్దె క్రాంతి కుమార్

0
143

*సేవే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందడుగు*

 

*మజ్జిగ పంపిణీ చేసిన గద్దె క్రాంతి కుమార్, భవకుమార్*

 

 

         తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ సేవా దృక్పథంతోనే ముందుకు సాగుతారని ఇది తెలుగుదేశం పార్టీ సేవా విధానానికి నిదర్శనం అని టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు.

 

           శుక్రవారం ఉదయం 16వ డివిజన్ రామలింగేశ్వర నగర్ సర్వీస్ రోడ్ కె. బిల్డింగ్ సమీపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కీ. శే గోగుల రమేష్ జయంతి సందర్బంగా గోగుల బ్రదర్స్ ఏసుబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీడీపీ నాయకులు గద్దె క్రాంతి కుమార్, బొప్పన భవ కుమార్ లు ప్రారంభించి వాహన దారులకు మజ్జిగ, సుగంధి వాటర్ పంపిణీ చేశారు. 

 

          ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్, బొప్పన భవ కుమార్ లు మాట్లాడుతూ ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, కార్మికులు, సాధారణ ప్రజలకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయాల సమయంలోనే రాజకీయాలు చేస్తుందని మిగతా సమయం అంతా సేవాదృక్పథంతో సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని తెలిపారు. నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో టీడీపీ, జెనసేన, బీజేపీ నాయకులు శ్రేణులు ప్రజల అవసరాలను గుర్తించి ప్రతి సమయంలో అండగా నిలబడటం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ప్రజాసేవనే ప్రధాన సిద్ధాంతంగా తీసుకుని ముందుకు సాగిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అదే సేవా భావనతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న ఈ కాలంలో ప్రజలకు తాగునీరు, మజ్జిగ అందించడం చిన్న కార్యక్రమం అయినా, దాని వెనుక ఉన్న మానవత్వమే గొప్పదని తెలిపారు. 

 

           ఈ కార్యక్రమంలో గోగుల ఏసుబాబు, రత్నం రమేష్, ఉమ్మడిశెట్టి బహదూర్, పున్నవల్లి రాధాకృష్ణ, మైలమూరి పీరుబాబు, మొకర ఆదిబాబు, సింగంశెట్టి రమేష్, రాయి రంగమ్మ, పెద్ది అన్నారావు, వేముల దుర్గారావు, పోలిపల్లి ముని, గల్లా శ్రీను, మొకర రమణ, శ్రీను తదితరులు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బోయకొండ అటవీ ప్రాంతంలో వ్యక్తి హత్య
చౌడేపల్లి మండలం బోయకొండ పరిసర అటవీ ప్రాంతంలో వ్యక్తిని హత్య చేసిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల...
By Kothuru Murali 2026-04-07 05:35:04 0 208
Bharat Aawaz
💔 A Mother’s Last Embrace: Miracle Survival in Air India Crash
In a heartbreaking yet awe-inspiring moment during the tragic Air India crash on June 12, an...
By Bharat Aawaz 2025-07-28 12:09:53 0 2K
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించి
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్...
By Chennaiah Kati 2026-01-24 00:32:23 0 258
Bharat Aawaz
ANTI DRUG AWARENESS PRORAME
Student Awareness Program Held at HMT Nagar Lake Park Nacharam Police Conduct Anti-Drug, Traffic...
By Shaik Baba 2026-09-16 13:53:37 0 100
Himachal Pradesh
Himachal Expands Green Energy and Renewable Power in 2026
Himachal Pradesh is accelerating its transition toward clean and renewable energy by expanding...
By Fathima Safa 2026-07-06 07:05:42 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com