ఆత్రం సుగుణ ఆరోపణలను తిప్పికొట్టిన మున్సిపల్ కౌన్సిలర్లు

0
193

🎤కుమురం భీం ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఇటీవల నిర్వహించిన పత్రికా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె. విశ్వప్రసాద్‌రావుపై ఆమె చేసిన ఆరోపణలు ముమ్మాటికీ నిరాధారమైనవని ఖండిస్తూ వారు ఒక సంయుక్త ప్రకటన ద్వారా స్పష్టతనిచ్చారు.మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే మాజీ అధ్యక్షుడు కె. విశ్వప్రసాద్‌రావు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఎంతో కృషి చేశారని కౌన్సిలర్లు గుర్తుచేశారు. సొంత ఖర్చులతో ఎన్నికల సామగ్రి, ప్రచార రథాలు సమకూర్చి కార్యకర్తలలో ఉత్సాహం నింపారని తెలిపారు. చైర్మన్ ఎన్నికల్లో నలుగురు స్వతంత్ర కౌన్సిలర్లను కాంగ్రెస్ వైపు తీసుకురావడంలో ఆయన పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి చైర్మన్ కాకూడదనే ఉద్దేశం ఆయనకు ఉంటే, స్వతంత్రులను కాంగ్రెస్‌లోకి ఎందుకు తెస్తారని ఆత్రం సుగుణను నిలదీశారు.అదేవిధంగా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గదవేని మల్లేష్ గారికి 2వ వార్డు, 6వ వార్డు మరియు 19వ వార్డు ఎన్నికల బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే 19వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి లేకపోవడం ద్వారా పరోక్షంగా బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చినట్లుగా భావించాల్సి వస్తుందని, దీనిపై కూడా పార్టీ నాయకత్వం వాస్తవాలను పరిశీలించాలని కోరుతున్నారు.మాజీ ఏఎంసీ చైర్మన్ గదవేని మల్లేష్ గారి మిత్రుడైన శ్రీ అబ్దుల్ గారు రూ.1 కోటి 50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ చైర్మన్ పదవి దక్కలేదని పేర్కొనడం శోచనీయం. నిజంగా రూ.1.50 కోట్లు ఖర్చు జరిగి ఉంటే, ఆ డబ్బు ఎవరు ఇచ్చారు? ఎవరు తీసుకున్నారు? ఎక్కడ, ఎప్పుడు, ఎవరి ద్వారా చెల్లించారు? అనే విషయాలను స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగిస్తుందాని.చైర్మన్ ఎన్నికల సమయంలో పార్టీకి ఎవరు వెన్నుపోటు పొడిచారో, ఎవరు నిజాయితీగా పనిచేశారో తేలాలంటే ఆత్రం సుగుణ, అజ్మీరా శ్యామ్ నాయక్, కె. విశ్వప్రసాద్‌రావు, ఆత్రం సక్కుతో పాటు గుండా శ్యామ్ మరియు ఆయన సతీమణి ఫోన్ కాల్ వివరాలను చట్టపరమైన నిబంధనల ప్రకారం పరిశీలించాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ఎవరెవరు ఎవరితో రహస్య సంప్రదింపులు జరిపారో, ఎవరు అడ్డంకులు సృష్టించారో వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. ఇప్పటికైనా నిరాధార ఆరోపణలు మానుకొని, పార్టీ బలోపేతం కోసం అంతా ఐక్యంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఆసిఫాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు రాపర్తి కార్తీక్, కొండు భారతి, హనుమండ్ల స్వప్నరాణి, కనక కృష్ణమ్మ, కస్తూరి పుష్పలత, లొనారే తారాబాయి స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Telangana
దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం.|
● 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ● జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఈటల...
By Sidhu Maroju 2026-08-15 06:50:57 0 178
Bihar
Bihar C M nitesh kumar resigned
🟥 బీహార్‌లో రాజకీయ సంచలనం… సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా బీహార్ రాజకీయాల్లో...
By G k Nookala 2026-04-14 10:25:54 0 196
Telangana
సీయం దిష్టిబొమ్మ దహనం అడగింపు
సిట్ విచారనాకు వ్యతిరేకంగా సియం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడనికి brs నాయకులు ఆదివారము...
By Sadaq Sadaq 2026-02-01 11:23:02 0 331
Andhra Pradesh
ఈ నెల 19న ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో జరగనున్న గౌరవ ముఖ్యమంత్రి పర్యటన
విశాఖపట్నం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ నెల 19న ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU)...
By Santhosh Kumar 2026-09-15 09:14:24 0 104
SURAKSHA
The Sentinel of Justice: The Unwavering Journey of Shri. Rachakonda Vishwanath
From the Classrooms of Ambition to the Frontlines of Public Service: A Story of Dedication,...
By Kalaga Sailaja 2026-07-14 10:56:49 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com