Bharat Aawaz

కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ నేత శివరామ్ నాయక్ కీలక భేటీ ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్‌తో చర్చలు

Chunarkar Jagadeesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
262
Views

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ (AICC) ఇన్‌ఛార్జ్ సెక్రటరీ శ్రీ సచిన్ సావంత్ జీని కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీ శివరామ్ నాయక్ గారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లో ఈ సమావేశం జరిగింది.ఈ భేటీ సందర్భంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పార్టీ సంస్థాగత బలోపేతం, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో చేపట్టబోయే ప్రజా పక్ష కార్యక్రమాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో యువతను పార్టీ వైపు మరింత క్రియాశీలకంగా భాగస్వామ్యం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.యువత ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని, ప్రభుత్వ ప్రజా రంజక విధానాలను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లాలని సచిన్ సావంత్ గారు ఈ సందర్భంగా శివరామ్ నాయక్‌కు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేస్తూ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని శివరామ్ నాయక్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.