మంచిర్యాలలోని నార్తిన్ హోటల్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
157

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నార్తిన్ హోటల్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ,ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి, మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాథ ఆలయాల ఆధునీకరణ పనులు వచ్చే శ్రావణమాసంలోగా గూడెం సత్యనారాయణ స్వామి, శ్రీ విశ్వనాథ ఆలయాల అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని ఆలయల పునఃనిర్మాణ వీడియోలు LED స్క్రీన్ ద్వారా చూపెట్టడం జరిగింది,98 కోట్ల రూపాయలతో గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం అభివృద్ధి పనులు మరియు పుష్కర ఘాట్ల నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి శ్రావణమాసంలోగా అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు అన్నారు. వచ్చే పుష్కరాల వరకు గూడెం అభివృద్ధి పనులు పుష్కర ఘాట్లు పూర్తి అవుతాయని తెలిపారు. ఆలయ పునర్నిర్మాణంతోపాటు భక్తులకు అన్ని రకాల వసతి సౌకర్యాలు పుష్కర ఘాట్లు బోటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు,

రెండవ అన్నవరంగా పేరుగాంచిన గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని ఆగమశాస్త్ర ప్రకారం అభివృద్ధి చేయడంతో పాటు.. ఒకేసారి వెయ్యి జంటలు వ్రతాలు చేసుకునే విధంగా మండపాలను నిర్మించనున్నట్లు చెప్పారు.

మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయం పునర్నిర్మాణ పనులు కూడా ప్రారంభించి త్వరలో పూర్తి చేస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, లక్షెట్టిపేట్ మండల అధ్యక్షులు, సర్పంచ్ నలిమెల రాజు, లక్షెట్టిపేట్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ మంగిలాల్, కార్పొరేటర్లు, నాయకులు , మహిళా నాయకురాలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో పాల్గొన్న..మంత్రి మండిపల్లి
*అన్నమయ్య జిల్లా*  *రాయచోటి నియోజకవర్గం* *తేదీ: 02-08-2026*   *'ఇంటింటికీ టీడీపీ...
By Benguluri Madhubabu 2026-08-02 09:42:40 0 245
Telangana
రాజకీయ వ్యాఖ్యల హద్దులు ఎక్కడ? వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్లీ చర్చలో బాల్క సుమన్ అరెస్ట్.!
ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజం. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ఆరోపణలు,...
By Ponnala Srinivasrao 2026-05-30 08:06:54 0 152
Andhra Pradesh
ఈగల్ ఆపరేషన్ ఆన్ గంజా యి హాట్ స్పాట్స్ విజయవాడ
*Press Note*    *Eagle Operation on Ganja Hotspots*    *EAGLE Team,...
By Rajini Kumari 2025-12-19 13:05:48 0 258
Telangana
KGBV పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కామ్లే అనిల్ కుమార్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-06-30 13:36:13 0 276
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com