ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో పాల్గొన్న..మంత్రి మండిపల్లి

0
238

*అన్నమయ్య జిల్లా* 

*రాయచోటి నియోజకవర్గం*

*తేదీ: 02-08-2026*

 

*'ఇంటింటికీ టీడీపీ – రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం' కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు*

 

రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని 25, 26వ వార్డుల్లో నిర్వహించిన *'ఇంటింటికీ టీడీపీ – రెండేళ్ల నమ్మకం,* అభివృద్ధి–సంక్షేమం' కార్యక్రమంలో *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు* పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు.

 

టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లిన *మంత్రి గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని* కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన *సంక్షేమ పథకాలు, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను* ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ప్రతి కుటుంబ సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని పారదర్శక పాలన అందిస్తోందని తెలిపారు.

 

ప్రతి ఇంటి గడప వద్ద ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న *మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు*, ప్రజలు తెలిపిన సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించి అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

 

ఈ సందర్భంగా *ప్రజలు మంత్రి గారికి ఘన స్వాగతం పలుకుతూ* ప్రభుత్వ పనితీరుపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రజల ఆదరణ, కార్యకర్తల అంకితభావమే తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద బలమని, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తూ రాష్ట్రాన్ని మరింత పురోగతి దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

 

*"ప్రతి ఇంటికి అభివృద్ధి... ప్రతి కుటుంబానికి సంక్షేమం... ప్రజల విశ్వాసమే మా బలం... సేవే మా ధ్యేయం." అనే నినాదంతో 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.*

Search
Categories
Read More
Andhra Pradesh
నారా లోకేష్ నేతృత్వంలోని కమిటీకి చంద్రబాబు దిశానిర్దేశం.
పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు వెంటనే...
By Pagadala Venkateswar 2026-05-22 05:33:37 0 130
Andhra Pradesh
బొలెరో ఢీకొని ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు.
సోమవారం ములకలచెరువు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురానికి చెందిన భాను ప్రకాశ్ (24),...
By Pagadala Venkateswar 2026-05-19 05:12:52 0 106
Andhra Pradesh
జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం.
లండన్‌లోని ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్‌గా జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎన్నిక భారత న్యాయ...
By Pagadala Venkateswar 2026-05-22 05:36:48 0 206
Telangana
మనకు ఒక స్థాయి ఉంది ! స్థాయి లేని వాళ్ళతో గొడవలొద్దు!
 గులాబీ సోదరులకు ఒక విన్నపం : 🙏 ‎ఎవ్వడు ఎటన్నా సావని , ఎవరి మీద పోస్టులు ఒద్దు !...
By Ponnala Srinivasrao 2026-04-27 10:02:51 0 164
Nagaland
Nagaland Boosts Youth Employment and Skill Programs
Nagaland is intensifying efforts to create employment opportunities and strengthen skill...
By Fathima Safa 2026-06-25 06:50:10 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com