Madanapalle: మదనపల్లెలో గాయపడి కోలుకుంటున్న సీనియర్ రిపోర్టర్ యుగంధర్‌ను జనసేన నాయకులు రాందాస్ చౌదరి, శ్రీరామ్ చినబాబు పరామర్శించి భరోసా కల్పించారు.

0
106

మదనపల్లె, ఆగస్టు 8: గత నెలలో గాయపడిన సీనియర్ రిపోర్టర్ యుగంధర్ (చిన్న) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు యుగంధర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా యుగంధర్ ఆరోగ్య పరిస్థితిని ఇరువురు నాయకులు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు ధైర్యం చెప్పి, త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, అవసరమైన సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీనియర్ రిపోర్టర్ యుగంధర్ త్వరగా కోలుకుని తిరిగి తన విధుల్లో చురుగ్గా పాల్గొనాలని గంగారపు రాందాస్ చౌదరి, శ్రీరామ్ చినబాబు ఆకాంక్షించారు. ఈ పరామర్శ సందర్భంగా యాలగిరి దొరస్వామి నాయుడు, ఖాన్ తదితరులు కూడా యుగంధర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పరామర్శించారు.

Search
Categories
Read More
Telangana
చెత్త కుప్పలు.. ప్రజలకు తిప్పలు..|
● జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరిన ఈటల...
By Sidhu Maroju 2026-08-05 09:26:29 0 146
SURAKSHA
S. Asker Ali IAS: Building Better Infrastructure for Progress
From a determined UPSC aspirant to Secretary, Public Works Department, S. Asker Ali, IAS, has...
By Lokeshwari Panthadi 2026-07-27 11:25:27 0 200
Andhra Pradesh
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం కమీటీ...
By Rajini Kumari 2026-05-07 08:16:30 0 152
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా నిర్వహించిన...
By Sadaq Sadaq 2026-08-26 08:09:37 0 124
Telangana
లోయోలా అకాడమీలో ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు.|
    సికింద్రాబాద్ : తెలంగాణ – లోయోలా అకాడమీ 1976లో స్థాపించబడి, శ్రేష్ఠత,...
By Sidhu Maroju 2025-12-20 10:11:54 0 246
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com