శ్రీశైలానికి పోటెత్తిన వరద.. నిండుకుండలా మారుతున్న జలాశయం.

0
101

కృష్ణా నది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 2,57,059 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయగా, శ్రీశైలం జలాశయానికి 2,11,331 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.

 

శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం అది 874.70 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయిలో నిండటానికి మరో 10 అడుగుల మేర నీరు చేరాల్సి ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 162.81 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రానున్న రెండు, మూడు రోజుల్లో నీటి నిల్వ 200 టీఎంసీలను దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు.

Search
Categories
Read More
Telangana
బైక్ ర్యాలీ...
ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ...
By Sadaq Sadaq 2026-09-05 14:43:02 0 140
SURAKSHA
Drug-Free Campaign: Empowering Our Youth
​The Drug-Free Campaign is a critical, proactive initiative dedicated to shielding youth from the...
By Kalaga Sailaja 2026-06-26 12:22:49 0 244
Telangana
ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు
కొత్త ఆరోగ్య, ప్రమాద బీమా పథకాలకు కేబినెట్ ఆమోదం   60 ఏళ్లలోపు ఉద్యోగి సహజ మరణానికి రూ.10...
By Pinnehasan Odela 2026-02-24 15:54:56 0 262
Andhra Pradesh
ప్రేమ వ్యవహారంలో పగ పెంచుకుని యువకుడి హత్య.. చీరాలలో దారుణ ఘటన ఐదుగురు నిందితుల అరెస్ట్
చీరాల:  చీరాల పట్టణంలోని రైల్వే ట్రాక్ పక్కన, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగిన దారుణ...
By Gadiyapudi Narendra 2026-02-04 16:28:10 0 217
SURAKSHA
Empowering Arunachal: The Police Ajin Citizen Initiative
The "Police Ajin" initiative marks a transformative shift in Arunachal Pradesh, placing community...
By Lokeshwari Panthadi 2026-07-04 08:49:40 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com