స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు.

0
148

 

స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు.

Andhra

Chandrababu Naidu Reviews Swachh Andhra Progress

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పురోగతిపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం

100 శాతం ఇంటింటి చెత్త సేకరణ, శుద్ధి జరగాలని ఆదేశం

అవసరమైన చోట కొత్తగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం

హాస్టళ్లలో తడి, పొడి చెత్త నిర్వహణపై ప్రత్యేక మార్గదర్శకాలు

పచ్చదనం పెంపు, సోలార్ రూఫ్‌టాప్‌లపై దృష్టి సారించాలని సూచన

'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమ పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు.

 

మున్సిపాలిటీల్లో అవసరమైన చోట కొత్తగా పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలని సీఎం సూచించారు. ఇంటింటికీ వెళ్లి 100 శాతం చెత్త సేకరణ జరగాలని, సేకరించిన చెత్తను శాస్త్రీయంగా శుద్ధి చేసే ప్రక్రియను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్దేశించారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో తడి, పొడి చెత్త నిర్వహణ, పరిశుభ్రమైన వంటగదుల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేశారు. సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటు, నెట్ జీరో సాధన, పచ్చదనం పెంపు వంటి అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు.

 

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పి. నారాయణ, పీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ కమిషనర్ సంపత్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె తాగునీటి సమస్యపై వక్రీకరణలు మానుకోవాలని వైసీపీకి టీడీపీ హెచ్చరిక. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చిప్పిలి ట్యాంక్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపణ.
మదనపల్లె: తాగునీటి సమస్యపై వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు...
By Pagadala Venkateswar 2026-07-20 11:28:13 0 115
Andhra Pradesh
Anna Canteen: పేదలకు శుభవార్త.. ఇక గ్రామాల్లో అన్న క్యాంటీన్లు.. సంక్రాంతి నుంచి ప్రారంభం
Anna Canteen: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో అన్న క్యాంటీన్లు...
By Siva Bhaskar 2025-12-25 02:22:39 1 866
Telangana
'ప్రవక్త మహమ్మద్' జయంతి. పాల్గొన్న బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్.    ప్రవక్త మహమ్మద్ జయంతిని పురస్కరించుకొని...
By Sidhu Maroju 2025-09-14 12:37:12 0 330
Entertainment
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In The Assamese music...
By BMA ADMIN 2025-05-21 13:37:06 0 2K
Andhra Pradesh
పిడుగు శబ్దానికే ఆగిన గుండెలు.. పల్నాడులో ఇద్దరు మహిళల మృతి.
  Andhra   పల్నాడు జిల్లాలో విషాద ఘటన నరసరావుపేట పరిధిలో వేర్వేరు గ్రామాల్లో ఘటనలు...
By Pagadala Venkateswar 2026-09-13 07:30:22 0 66
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com