నేడు ఏపీలో వానలు.. ఏయే జిల్లాల్లో అంటే?

0
101

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

 

విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మర్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడవచ్చని పేర్కొంది.

 

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ సూచించింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌ల కింద నిలబడవద్దని హెచ్చరించింది.                  

Search
Categories
Read More
Andhra Pradesh
వందమంది మహిళలకు డ్వాక్రా సంఘాలకు కుట్టు మిషన్లు అందజేసిన గద్దె రామ్మోహన్
*మహిళా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆలోచనలు* *డ్వాక్రాసంఘాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-03-13 12:39:45 0 170
Andhra Pradesh
ఏపీ కొత్త జిల్లాల ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం
 ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది....
By John Baji 2025-12-29 09:07:24 0 197
Puducherry
Reviving Heritage: Poornankuppam’s Sustainable Pond Project
The 400-year-old Muzhiyankulam, also known as the Poornankuppam Agriculture Pond, has been...
By Lokeshwari Panthadi 2026-06-29 04:36:53 0 104
Andhra Pradesh
చిన్న తిప్ప సముద్రంలో జాతీయ సైన్స్ దినోత్సవం.
మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని...
By Pagadala Venkateswar 2026-02-28 10:54:55 0 193
Telangana
సాయినగర్ సమస్యలపై శాంతి ఆకస్మిక పర్యటన.|
"మురుగు, వేలాడే విద్యుత్ తీగలు, నీటి నిల్వపై స్థానికులతో సమీక్ష" మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :...
By Sidhu Maroju 2026-07-01 09:31:13 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com