ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో తక్షణ స్పందన. పైప్‌లైన్ లీకేజీ సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్ రాపర్తి కార్తీక్

0
402

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ మరోసారి నిరూపించారు. గత కొన్ని రోజులుగా 11వ వార్డు పరిధిలో ప్రధాన పైప్‌లైన్ లీకేజీ కారణంగా తాగునీరు వృథా కావడంతో పాటు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ తక్షణమే స్పందించి, మున్సిపల్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అనంతరం మున్సిపల్ వాటర్ వర్క్స్ సిబ్బందితో కలిసి యుద్ధప్రాతిపదికన లీకేజీ మరమ్మతు పనులను స్వయంగా పర్యవేక్షించి, సమస్యకు తక్షణ పరిష్కారం చూపారు.ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ సచిన్ పృధ్వీరాజ్ కూడా పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ మాట్లాడుతు. వార్డులో ఎక్కడైనా తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు లేదా ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. చాలా రోజులుగా వేధిస్తున్న పైప్‌లైన్ లీకేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరించడంతో 11వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, సకాలంలో స్పందించిన కౌన్సిలర్ రాపర్తి కార్తీక్‌తో పాటు మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
దాంపత్యం అనేది ఒక నమ్మకం తో కూడిన ప్రయాణం.. స్వాతి నుండి రేణుక వరకు..‎భ‌ర్త‌లు వ‌ద్దు బాయ్ ఫ్రెండ్సే ముద్దు అంటూ అరాచకం
వివాహ వ్యవస్త మీద నమ్మకం ప్రాధాన్యత విలువలు లేకపోవడం విపరీతమైన స్వేచ్ఛ పెద్దలు ఆదాయ సంపాదనలో పడి...
By Ponnala Srinivasrao 2026-05-03 04:29:55 0 164
Kerala
Thiruvananthapuram:Kerala’s capital was on high alert Monday after bomb threats
Thiruvananthapuram:Kerala’s capital was on high alert Monday after bomb threats were issued...
By BMA ADMIN 2025-05-20 05:18:29 0 2K
Telangana
హైదరాబాద్ నగరంలో మరో దారుణం.|
హైదరాబాద్ – నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో  ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో...
By Sidhu Maroju 2025-12-26 08:58:53 0 269
Andhra Pradesh
గ్రీన్ వుడ్ హై స్కూల్ లో నారా లోకేష్ కు ఘన స్వాగతం
బెంగళూరులోని గ్రీన్ వుడ్ హై స్కూల్ లో శుక్రవారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు రాష్ట్ర ఐటీ శాఖ...
By Kothuru Murali 2026-04-11 06:38:10 0 143
Andhra Pradesh
పలు గ్రామాల్లో నేడు పవర్ కట్
బొబ్బిలి మండలం పారాది సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే పారాది, నారాయణప్పవలస, మెట్టవలస ఫీడర్...
By Boiena Rajesh 2026-05-01 01:24:52 0 278
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com