ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందును కలిసిన ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు

0
367

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు జిల్లా క్రీడా పాఠశాలకు విచ్చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ITDA) ప్రాజెక్ట్ అధికారి గౌరవ శ్రీ మంద మకరందు గారిని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు ఆసిఫాబాద్ నియోజకవర్గము లోని మారుమూల ప్రాంతాల అభివృద్ధి గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన తీవ్రంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుల గురించి పీఓ గారి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పాటుగా మంగి, పంగిడి మాదోర, గోపన, కోటాగం గ్రామాలకు సంబంధించిన సెల్ సిగ్నల్స్ సమస్యలను వివరించారు. అలాగే స్థానిక విద్యార్థులకు, యువతకు ఎంతో ప్రయోజనకరమైన కుమురం భీమ్ స్టడీ సర్కిల్ పునఃప్రారంభం గురించి క్షుణ్ణంగా వివరించి, వీటన్నింటిపై ఒక వినతి పత్రమును సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా గౌరవ పీఓ గారు సానుకూలంగా స్పందిస్తూ. నియోజకవర్గంలోని అన్ని సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇస్తూ, కుమురం భీం స్టడీ సర్కిల్ ని స్వయంగా సందర్శించడం జరిగింది.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి
మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు...
By Pinnehasan Odela 2026-04-09 13:52:32 0 291
Andhra Pradesh
దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా క్రిస్మస్ వేడుకలు
దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్:   దుబాయ్ లో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో...
By Rajini Kumari 2025-12-22 07:30:33 0 234
Telangana
నిజామాబాద్.14 సo! వస్తరాల బాలికలకు హె పి వి టికా ఎపించలి DMHO
14 సంవతరాల బాలికలందరికి HPV టికా ఐపించలాని నిజామాబాద్ డిఎంహెచ్ఓ రాజశ్రీ సుచించారు.జిల్లా వైద్య...
By Sadaq Sadaq 2026-03-06 18:00:24 1 295
Telangana
రోడ్డు నియమాలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలి జిల్లా ఎస్పీ నితికా పంత్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ : రోడ్డు...
By Chunarkar Jagadeesh 2026-06-10 19:28:18 0 244
Telangana
SIR ప్రక్రియ పై కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులోని మినీ పద్మనాయక ఫంక్షన్ హాల్ లో SIR...
By Avunoori Mahesh 2026-07-11 11:13:02 0 310
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com