బాబాపూర్ గ్రామానికి విచ్చేసిన ఆసిఫాబాద్ నూతన సీఐ నీలం రవి గారికి గ్రామస్తుల ఘన స్వాగతం

0
376

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆగస్టు 01:  ఆసిఫాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నీలం రవి గారు బాబాపూర్ గ్రామానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ సత్రవేణి. రాజన్న గారి ఆధ్వర్యంలో వార్డు ప్రతినిధులు, యువత నూతన సీఐకి పుష్పగుచ్ఛాలు అందించి మర్యాదపూర్వకంగా గ్రామంలోనికి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో స్థానిక నేతలు సీఐని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ నీలం రవి గారు మాట్లాడుతూ ఆసిఫాబాద్ టౌన్ సర్కిల్  పరిధితో పాటు బాబాపూర్ మరియు దాని పరిసర గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసు శాఖ పనిచేస్తుందని స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం పెంపొందించడానికి, నేరాల నియంత్రణకు ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎల్లవేళలా పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. పోలీసు శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దశరథ్, సాయి, వెంకటి, గ్రామ పెద్దలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu: తిరుమల వీధుల్లో నడుస్తూ.. భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.
సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కుమారుడైన దేవాన్ష్ జన్మదిన వేడుకలు...
By Pagadala Venkateswar 2026-03-21 06:21:24 0 202
Andhra Pradesh
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు సమావేశంలో పాల్గొన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశంలో జిఎస్టి రుద్రేటు విజన్ 2047...
By Benguluri Madhubabu 2026-02-09 08:00:49 0 314
Andhra Pradesh
పవర్ కట్.. తాగునీటి సరఫరాకు అంతరాయం
వంగరలో తాగునీటి సరఫరా ఆదివారం నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులు బోరు మోటర్లు వద్ద నీటిని...
By Boiena Rajesh 2026-08-30 05:38:56 0 110
Maharashtra
Massive Digital Shift: Over 11 Lakh Families Complete Census Self-Enumeration
Maharashtra is embracing a major digital transition. Official data released today confirms that...
By Dunna Jessicaruth 2026-05-18 09:48:25 0 124
Andhra Pradesh
అన్నమయ్య: ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు.
అన్నమయ్య జిల్లా పోలీసులు మంగళవారం ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు....
By Pagadala Venkateswar 2026-02-10 07:35:46 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com