రూ.1.40 కోట్ల రూసా నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు

0
1K

కర్నూలు నగరంలోని ఉస్మానియా కళాశాలలో రూ.1.40 కోట్ల రూసా నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను రాష్ట్ర మంత్రి టిజీ భరత్ గారితో కలిసి కర్నూలు ఎం.పీ బస్తిపాటి నాగరాజు ప్రారంభించారు.. ఈ సందర్బంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రూసా నిధులతో అదనపు తరగతుల నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ స్థలాలను చూపించి వాటి నిర్మాణాలను త్వరగా పూర్తిచేసే చర్యలు తీసుకోవాలని కోరామని తెలియజేశారు. ఉస్మానియా కాలేజీ తో తనకు చాలా అనుబంధం ఉందని 1994- 96 సంవత్సరాల లో ఎంఎస్సీ, బీఈడీ పరీక్షలు ఈ కళాశాలలోనే రాయడం జరిగిందని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ ఎస్ ముజామిల్ సెక్రటరీ మరియు కరస్పాండెంట్ శ్రీమతి ఆజ్రా జావేద్, రూస ఇంచార్జ్ డాక్టర్ ఎస్. గజని కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
భార్యను చంపి వాట్సప్ స్టేటస్ పెట్టాడు.. ఆ తర్వాత.. ఉలిక్కిపడిన వరంగల్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను చంపి వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు.. తన భార్య...
By SivaNagendra Annapareddy 2025-12-14 07:37:24 0 110
BMA
Our Mission: From Silence to Strength
Our Mission: From Silence to Strength  In a world of noise, the stories that matter most...
By Bharat Aawaz 2025-07-09 04:32:19 0 1K
Haryana
Supreme Court Eases Restrictions on Ashoka Professor, Criticizes Haryana SIT
Supreme Court Eases Restrictions on Ashoka Professor, Criticizes Haryana SIT The Supreme Court...
By Bharat Aawaz 2025-07-17 06:43:42 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com