ఉద్యమ సహచరుడు, సోదరుడు, మంచి మనసున్న మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింది.హరీష్ రావు

0
162

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మృత్యువును జయించి తిరిగి వస్తారనే ఆశతో మనమంతా ఎదురుచూశాం. కానీ, ఆయన ఇక మన మధ్య లేరన్న వార్తను జీర్ణించుకోవడం ఎంతో కష్టంగా ఉంది.

‎తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని జీవితాంతం నిలబెట్టిన పోరాట యోధుడిగా, ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన సోదరుడిగా పెద్ది సుదర్శన్ అన్న ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు.

ఆయన మన మధ్య లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటు. వ్యక్తిగతంగా నాకు ఒక ఉద్యమ సహచరుడిని, ఆత్మీయ సోదరుడిని కోల్పోయిన బాధ ఇది.

పెద్ది సుదర్శన్ అన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

పెద్ది అన్నకు జోహార్లు..

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రగ్స్ రహిత సమాజమే మా లక్ష్యం
*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-02-07 11:50:31 0 192
Andhra Pradesh
నందిగామలో భక్తిశ్రద్ధలతో పీర్ల పండగ వేడుకలు
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అన్నదాన కార్యక్రమంనందిగామ పట్టణంలో పీర్ల పండుగను భక్తిశ్రద్ధలతో,...
By Patan Khuddus 2026-06-25 18:19:42 0 261
Andhra Pradesh
హలో లోకేష్ పేరుతో విద్యార్థులతో మంత్రి లోకేష్ ముఖాముఖి
*రాజమహేంద్రవరం : ‘హలో లోకేష్’ పేరుతో విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి.*...
By Rajini Kumari 2025-12-20 09:40:43 0 218
Andhra Pradesh
మదనపల్లె టమోటా మార్కెట్లో చిన్న క్రేట్ల ఎగుమతులు ప్రారంభం.
మదనపల్లె టమోటా మార్కెట్లో శుక్రవారం ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ చిన్న క్రేట్ల (15 కిలోల బాక్సులు)...
By Pagadala Venkateswar 2026-02-14 06:47:57 0 190
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:36:41 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com