నందిగామలో భక్తిశ్రద్ధలతో పీర్ల పండగ వేడుకలు

0
258

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అన్నదాన కార్యక్రమంనందిగామ పట్టణంలో పీర్ల పండుగను భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. పీర్లను తీసుకుని భక్తులు పట్టణ వీధుల్లో ఊరేగింపుగా తిరుగుతూ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి, సౌభ్రాతృత్వం, మానవతా విలువలు వెల్లివిరిశాయి.భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సమాజంలో శాంతి, సుఖసంతోషాలు నెలకొనాలని ప్రార్థించారు. పండుగ సందర్భంగా భారత టాకీస్ రోడ్డులోని పీర్ల వద్ద భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదానంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు పాల్గొని సామరస్యానికి ప్రతీకగా నిలిచాచిన్నా పెద్దా అనే తేడా లేకుండా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. నిర్వాహకులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా నందిగామ పట్టణ మూడో వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఇమామ్ జానీ మాట్లాడుతూ, పీర్ల పండుగ మత సామరస్యానికి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. భిన్న మతాల ప్రజలు ఒకే వేదికపై కలిసి పాల్గొనడం నందిగామలో నెలకొన్న సోదరభావానికి నిదర్శనమని అన్నారు._పీర్ల పండుగ వేడుకలు భక్తి, ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యతలను చాటుతుందని తెలిపారు.

Search
Categories
Read More
SURAKSHA
Sagili Shan Mohan, IAS: Driving Excellence in Public Administration
A Dynamic Civil Servant Advancing Good Governance, Administrative Reforms, and Citizen-Centric...
By Lokeshwari Panthadi 2026-07-11 10:09:10 0 231
Telangana
సందిగ్ధంలో అజారుద్దీన్ మంత్రి పదవి.|
హైదరాబాద్ : ఎమ్మెల్సీ కేసు పెండింగ్‌లో ఉండగా, కోర్టు తీర్పుపై ఆధారపడి ఉన్న అజారుద్దీన్...
By Sidhu Maroju 2025-12-26 09:42:04 0 237
Karnataka
Bengaluru Metro Phase 3: Dispute Over Massive Tree Removal
The upcoming Namma Metro Phase 3 project has run into a major environmental roadblock. The...
By Lokeshwari Panthadi 2026-06-30 08:57:43 0 159
Andhra Pradesh
గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ఎన్. సి. సి అవార్డు.
మదనపల్లె మండలం సి. టి. ఎమ్. పాఠశాల ఎన్. సి. సి ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక...
By Pagadala Venkateswar 2026-03-01 04:26:53 0 201
Telangana
నియాజమాబా: అంబేత్కర్ జయంతి వేడుకలు
ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం సభ్యులు మరియు 19వ డివిజన్...
By Sadaq Sadaq 2026-04-14 09:37:38 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com