ముగిసిన సమయం.. శ్రీకాకుళం జైలు వద్ద జగన్, సీదిరి అప్పలరాజుల ములాఖత్ రద్దు.
Posted 2026-07-30 14:20:14
0
101
రోడ్డు ప్రమాదం కేసులో అరెస్టయి శ్రీకాకుళం అంపోలు జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైసీపీ అధినేత జగన్ ములాఖత్ చివరి నిమిషంలో రద్దయింది. ములాఖత్ కోసం జగన్ కు జైలు అధికారులు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. అయితే జైలు వద్దకు జగన్ చేరుకునే సమయానికి నిర్ణీత గడువు ముగిసిపోయింది. సమయం దాటిన తర్వాత కూడా అప్పలరాజును కలిసేందుకు వైసీపీ నేతలు అనుమతి కోరగా, జైలర్ ఉన్నతాధికారులతో సంప్రదించారు. జైలు నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని, సాయంత్రం 5 గంటల దాటిన తర్వాత ఎలాంటి ములాఖత్‌కు అనుమతి లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
జైలు నిబంధనల దృష్ట్యా అధికారుల నుంచి అనుమతి లభించకపోవడంతో జగన్, సీదిరి అప్పలరాజుల ములాఖత్ రద్దయింది. అనంతరం జైలు ప్రాంగణం వద్దే వేచి ఉన్న అప్పలరాజు కుటుంబ సభ్యులను జగన్ కలిసి పరామర్శించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మార్కాపురం జిల్లా దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు మీ పింఛన్ల కార్యక్రమం
* *టిడిపి - జనసేన - కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం* :🙏
తేదీ : 28-02-2026, అనగా రేపు దర్శి...
రౌడీ షీటర్లకు డిఎస్పి స్ట్రాంగ్ వార్నింగ్
రౌడీ షీటర్లకు సత్ ప్రవర్తన కలిగి ఉండాలని ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు అందితే కఠిన...
అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం •
అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం
• రాజ్యాంగ స్ఫూర్తిని...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
జాతీయ విలువిద్య పోటీలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వానం
మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర యువజన రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...