అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం •

0
255

అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం

 

• రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కలల రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం ఆనందాన్నిచ్చింది. అద్భుతంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భవిష్యత్ లక్ష్యాలకు అద్దంపట్టింది. నేలపాడు ప్రాంతంలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలో పాల్గొన్న 22 శకటాలు రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి నగరం సకల సౌకర్యాలతో విశ్వనగరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. 

గణతంత్ర దినోత్సవ వేదిక నుంచి గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసింది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వేసే ప్రతి అడుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా... రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా ఉంటుందని మాటిస్తున్నాము.

(పవన్ కళ్యాణ్)

ఉప ముఖ్యమంత్రి

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ నగరంలో BRS పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు డివిజన్...
By Sadaq Sadaq 2026-05-14 16:32:17 0 137
Telangana
ఇక నుంచి చెరువుమాదారం లో PHC సేవలు అందుబాటు
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చెరువుమాదారం గ్రామానికి PHC తరలింపు చేశారు.కాగా ఇక నుంచి డాక్టర్లు రోజు...
By Krishna Balina 2026-01-08 09:39:31 0 253
Telangana
మద్యం దుకాణాల సంఖ్య పెరిగిపోతుండడంపై హైకోర్టు ఆందోళన.|
హైదరాబాద్ – నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో నివాసాల మధ్య మద్యం దుకాణం...
By Sidhu Maroju 2025-11-26 07:34:43 0 218
SURAKSHA
Bengaluru Police Plant Trees With School Children
: Bengaluru Police today partnered with school children for a tree plantation drive on...
By Kalaga Sailaja 2026-07-06 07:02:15 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com