జిల్లా విద్యారంగ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

0
135

యువగళం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి ఉదయ, రంగప్ప డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన సందర్భంగా కర్నూలు విద్యారంగ సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించడంతో పాటు రాయలసీమ, ఉర్దూ, క్లస్టర్ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆదోని ప్రాంతంలో విద్యార్థుల వలసలను నివారించేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని, ఆదోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రారంభించాలని కోరారు. అలాగే ఆలూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభం, బీసీ ప్రీమియర్ హాస్టళ్లు ఏర్పాటు వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి రాము, జిల్లా కమిటీ సభ్యుడు అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Puducherry
Puducherry Rolls Out Financial Inclusion Campaign Across Panchayats
From July 1 to September 30, Puducherry is implementing a Financial Inclusion Saturation Campaign...
By Bharat Aawaz 2025-07-17 11:22:40 0 1K
Telangana
మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహనికి నివాళులు అర్పించిన :ఎంపీ వంశీ కృష్ణ
మంచిర్యాల : డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద...
By Avunoori Mahesh 2026-04-14 14:58:47 0 246
Andhra Pradesh
గిరిజనుల వినూత్న నిర్ణయం అతిక్రమిస్తే "రెండు లక్షలు" జరిమానా!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోని గిరిజన గ్రామాలు తమ ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలను...
By Shyamala Yadagiri 2026-05-14 06:10:42 0 211
Telangana
నిజామాబాద్: అద్నాపు కలెక్టర్ గా ప్రదీప్ కుమార్ భాద్యతలు
నిజామాబాద్ అదానపు కలేక్టర్ (స్థానిక సంస్థలు)  గ నగరపాలక సంస్థ కామిష్ణర్ దిలీప్ కుమార్...
By Sadaq Sadaq 2026-03-02 15:34:29 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com