తక్షణమే కోసిగి ఇంటిగ్రేడ్ హాస్టల్ ఎత్తివేసే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోవాలి

0
139

కోసిగి మండలంలో ఉన్న సంక్షేమ బాలుర వసతిగృహం (ఇంటిగ్రేటెడ్) హాస్టల్‌ను ఎత్తివేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్.ఈరేష్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రాజు మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ విద్యార్థులకు నిలయంగా ఉన్న కోసిగి హాస్టల్‌ను ఎత్తివేయడం వల్ల వందలాది మంది పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు మరోపక్క హాస్టల్ వార్డెన్, జయరాముడు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ శ్రీనివాసులు,బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన వారు బలవంతంగా 80 మంది విద్యార్థులను హాస్టల్ నుండి వెళ్ళగొట్టేందుకు హాస్టల్ వార్డెన్ తో హైస్కూల్ పంపించి ప్రధానోపాధ్యాయులకు విద్యార్థులకు టీసీలు ఇచ్చి ఇంటికి పంపించాలని ఇది జిల్లా కలెక్టర్ ఆదేశాలు అని చెప్పిస్తున్నారని. ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు విద్యార్థుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా ప్రవర్తిస్తున్నారని, మండిపడ్డా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తక్షణమే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి, కోసిగిలోనే హాస్టల్‌ను యథావిధిగా కొనసాగించేలా చర్యలు చేపట్టాలి. పేద విద్యార్థుల చదువుతో ఆడుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తే విద్యాశాఖ మంత్రి పర్యటనను అడ్డుకోవడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మల్లికార్జున, స్వామి, హుసేని,సురేష్,మళ్లీ తేజ,ఆకాష్,అశోక్,రాము ,కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
దొంతిరి కార్తీక్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ రామ్ లీలా మైదానంలో దొంతిరి కార్తీక్...
By Sidhu Maroju 2025-12-07 15:17:59 0 318
Maharashtra
Agricultural Development and Farmer Welfare in Maharashtra
Agricultural development and farmer welfare remain key priorities in Maharashtra's growth...
By Fathima Safa 2026-06-23 07:36:16 0 290
Andhra Pradesh
ఏప్రిల్ 11న జ్యోతీరావ్ ఫులె జయంతి నిర్వహణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిరావు ఫులె 200వ జయంతి కార్యక్రమాన్ని ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు...
By Boiena Rajesh 2026-04-10 01:02:38 0 189
Jharkhand
Jharkhand Strengthens Law and Order Across the State
Jharkhand has continued to enhance law and order in 2026 by strengthening policing, expanding...
By Fathima Safa 2026-07-01 10:02:00 0 81
Tamilnadu
Driving Innovation: The Industry 5.0 Global Conference
KCG College of Technology in Chennai is hosting the third edition of the International Conference...
By Lokeshwari Panthadi 2026-06-27 10:33:28 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com