హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించండి.. తెలంగాణ సీఎస్‌కు హైకోర్టు సంచలన ఆదేశాలు
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని సీఎస్‌ను ఆదేశించింది. లోతుకుంట భూముల కేసు విచారణ సందర్భంగా ఆయనపై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం.. ఆ పదవిలో కొనసాగకూడదని తేల్చి చెప్పింది. హైకోర్టుకు రంగనాథ్ బేషరతుగా క్షమాపణలు చెప్పినా.. ఒక ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
హైదరాబాద్ నగర పరిధిలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ ఆక్రమణలను అడ్డుకోవడం.. చెరువులు, కుంటలు, పార్కులను రక్షించడం కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్‌ను తొలగించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏవీ రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి.. ఆయన స్థానంలో అర్హత కలిగిన మరో అధికారిని ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సీఎస్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz