సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు

0
258

సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు

👉ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ గారు

పోలీసు శాఖలో విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన జిల్లా స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ తుమ్మల సింగయ్య HC.1906, 36 సర్వీస్ శనివారం ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. 

జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు, కఠిన పరిస్థితులు ఎదుర్కొంటూ పోలీసు ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. పోలీసు విధుల నిర్వహణలో కుటుంబానికి దూరంగా ఉంటూ విధులపట్ల అంకితభావంతో పనిచేశారన్నారు.జిల్లా పోలీస్ శాఖకు వారు అందించిన సేవలను శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, గతంలో వారు క్యాష్ రివార్డ్స్–20, జీఎస్‌ఈ–50, సేవాపతకం–1 పొందివున్నారు. పోలీసు ఉద్యోగంలో సేవలందించేందుకు సహాయ సహకారాలు అందించిన కుటుంబ సభ్యులకు జిల్లా పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. వారి పట్ల ప్రేమ, ఆప్యాయతతో ఉండాలని సూచించారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. విరమణ అనంతరం ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని, పోలీసు శాఖ ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో ఎఆర్ఎస్సై తిరుపతి స్వామి, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Arunachal Pradesh
Arunachal Expands Hydropower and Renewable Energy
Arunachal Pradesh continues to strengthen its energy sector by advancing hydropower projects and...
By Fathima Safa 2026-07-06 09:04:53 0 343
Andhra Pradesh
South Coast Railway way Zone
దశాబ్దాల కలకు సాకారం.. నేటి నుంచి విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం.. రాష్ట్ర ప్రజల...
By G k Nookala 2026-06-01 04:34:43 0 187
Andhra Pradesh
Sreelalitha: విజయవాడ గాయనిపై మోదీ ప్రశంస.. ప్రధాని పోస్ట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు.
విజయవాడ గాయని శ్రీలలిత ఆలపించిన ఓ భక్తి గీతానికి అరుదైన గౌరవం దక్కింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన...
By Pagadala Venkateswar 2026-03-25 03:15:09 0 206
SURAKSHA
K. Karthik IPS: A Rising Leader in Kerala Police Service
The Journey Begins "The strength of policing lies not in authority alone, but in the...
By Fathima Safa 2026-07-10 04:17:15 0 198
Andhra Pradesh
ఘనంగా బడే హజరత్ బాబా ఉరుసు మహోత్సవం
తొర్లపాడు , ఎన్టీఆర్ జిల్లా కుల మతాలకు అతీతంగా బడే హజరత్ ఉరుసు ఉత్సవాలు  -:డాక్టర్...
By Patan Khuddus 2026-04-29 15:17:53 0 329
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com