ఆసిఫాబాద్ టౌన్ సీఐ బాలాజీ వరప్రసాద్‌పై బదిలీ వేటు. కొత్త సీఐగా నీలం రవి

0
257

ఆసిఫాబాద్, జూలై 25 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కీలక పోలీస్ అధికారి బదిలీ అయ్యారు. ఆసిఫాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) బాలాజీ వరప్రసాద్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను తక్షణమే ఇక్కడి నుంచి బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 (IG) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా సీఐ బాలాజీ వరప్రసాద్‌పై వివిధ రకాల ఆరోపణలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు స్పందించి ఈ హఠాత్ బదిలీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయనను తన ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పుకుని, హైదరాబాద్‌లోని మల్టీ జోన్-1 కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఐజీ ఆదేశించారు. బాలాజీ వరప్రసాద్ బదిలీతో ఖాళీ అయిన ఆసిఫాబాద్ టౌన్ సీఐ స్థానంలో కొత్త అధికారిని నియమించారు. ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ సీఐగా విధులు నిర్వహిస్తున్న నీలం రవికి ఆసిఫాబాద్ టౌన్ సీఐగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం కొత్త పోస్టింగ్ ఇచ్చింది. వీలైనంత త్వరలోనే నీలం రవి ఆసిఫాబాద్ టౌన్ సీఐగా కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.

Search
Categories
Read More
Chhattisgarh
Chhattisgarh Expands Water Conservation and Irrigation
Chhattisgarh continues to prioritize water conservation and irrigation by expanding irrigation...
By Fathima Safa 2026-07-01 09:12:56 0 175
Andhra Pradesh
మదనపల్లె చిన్నారి కుటుంబానికి రూ. 10 లక్షల సహాయం – మంత్రి.
మదనపల్లిలో జరిగిన చిన్నారి హత్య ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి సోమవారం...
By Pagadala Venkateswar 2026-03-31 03:27:19 0 181
Andhra Pradesh
మార్కాపురం జిల్లా.... తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని స్వచ్చందంగా పంపిణి చేసిన SEVAస్వచ్చంద సంస్థ
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష...
By Chennaiah Kati 2026-03-10 11:02:11 0 481
Andhra Pradesh
స్వర్ణం వార్డు-స్వర్ణ సచివాలయాలు
ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయా పేరు ను అధికారికంగా మార్చింది.ఇక నుంచి స్వర్ణ...
By Karapati Gopi 2025-12-30 01:02:52 0 324
Andhra Pradesh
పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ మాలధారణ ప్రారంభం
*పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ మాలాధారణ ప్రారంభం*    పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత...
By Rajini Kumari 2025-12-15 07:54:23 0 264
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com