కార్పొరేట్ స్థాయి సేవలతో పోస్టాఫీసుల ఆధునికీకరణ

0
229

కార్పొరేట్ స్థాయి సేవలతో పోస్టాఫీసుల ఆధునికీకరణ

గ్రామాల నుంచి నగరాల వరకు ప్రజలకు మరింత చేరువగా సేవలు – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోస్టాఫీసుల ఆధునికీకరణలో భాగంగా చంద్రమౌళి నగర్‌లో నూతనంగా ఆధునికీకరించిన పోస్టాఫీస్‌ను కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు ప్రారంభించారు. అనంతరం కొమ్మినేని గార్డెన్స్‌లో నిర్వహించిన పోస్టాఫీస్ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా పోస్టల్ సేవలను డిజిటలైజేషన్, ఆధునికీకరణ దిశగా తీసుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. పోస్టాఫీసులు ఇక సంప్రదాయ ఉత్తరాల పంపిణీ కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ఆధునిక సాంకేతికతతో ప్రజలకు బహుముఖ సేవలు అందించే కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో కూడా పోస్టల్ సేవలను సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. నగరాలతో పాటు రిమోట్ గ్రామాలకు కూడా నాణ్యమైన సేవలు చేరేలా పోస్టాఫీసులను ఆధునికీకరిస్తుండడం కేంద్ర ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు.

చంద్రమౌళి నగర్ పోస్టాఫీస్ ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తోందని, ఇప్పుడు ఆధునిక సౌకర్యాలతో మరింత ప్రజానుకూలంగా మారడం స్థానికులకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు. ఒకప్పుడు దేశ ప్రజల జీవితంలో కీలకపాత్ర పోషించిన పోస్టల్ వ్యవస్థ, కాలానుగుణ మార్పులతో కొంత వెనుకబడినా, ప్రస్తుతం ఆధునికీకరణ ద్వారా మళ్లీ కార్పొరేట్ స్థాయి సేవలతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటోందని అన్నారు.

ప్రస్తుతం పోస్టాఫీసుల్లో కొరియర్ సేవలు, డిజిటల్ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అనుసంధానం, డాక్ బ్యాంకింగ్ సేవలు, పాస్‌పోర్ట్ సేవల కోసం దరఖాస్తుల స్వీకరణ వంటి అనేక సేవలను ఒకేచోట అందుబాటులోకి తీసుకువస్తున్నారని తెలిపారు.

ప్రజలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న ఆధునిక సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Uttar Pradesh
Uttar Pradesh 2026: Healthcare and Medical Expansion
Uttar Pradesh is strengthening its healthcare system in 2026 through various initiatives focused...
By Fathima Safa 2026-06-16 11:44:49 0 133
Andhra Pradesh
#petrol yuddam
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో పెట్రోల్ యుద్దం వాహనదారులు ఇబ్బందులు
By Kokkiligadda Suresh 2026-04-27 08:24:08 0 745
Telangana
హైదరాబాద్‌లో త్రివర్ణ పతాక ర్యాలీ – జాతీయ గర్వానికి పిలుపు
హైదరాబాద్-తెలంగాణ: ఈ నెల 14న హైదరాబాద్‌లో ప్రత్యేకమైన తిరంగ ర్యాలీ...
By Bharat Aawaz 2025-08-11 11:59:25 0 1K
Andhra Pradesh
అది సూక్ష్యమైన అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేయించిన జనసేన నాయకురాలు ఫాతిమారాణి
విజయవాడ    అతి సూక్ష్మమైన అంబేడ్కర్ బంగారు విగ్రహాన్ని తయారు చేయించిన గోపాలపురం జనసేన...
By Rajini Kumari 2026-05-15 12:15:46 0 158
Telangana
అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే శ్రీగణేష్
కంటోన్మెంట్ వార్డు 1 లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ 60 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు....
By Sidhu Maroju 2025-07-10 05:53:41 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com