Srp 3 గనిలో ఓవర్మెన్ మోసిన్ ఆగడాలని నిరసిస్తూ కార్మికుల ఆందోళన

0
55

తేదీ. 24.07.26 శుక్రవారం రోజున SRP3 గని యందు జనరల్ షిఫ్ట్ ఓవర్ మెన్ మోసిన్ యొక్క ఆగడాలు భరించలేక గని కార్మికులు ఆందోళనకు దిగారు. మోసిన్ యొక్క ఆగడాల గురించి సంబంధిత అధికారులతో పాటు గని మేనేజర్ గారి దృష్టికి కార్మికులు మరియు గుర్తింపు సంఘం నాయకులు తీసుకుపోయారు. అయినను మోసిన్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు.

మోసిన్ పై వస్తున్న విమర్శలు : ప్రధానంగా చాలామంది ఉద్యోగులను వారికి కేటాయించిన పని దగ్గర తీవ్రమైన బూతులు, అవమాన కర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా అంటే మీ దిక్కున్న కాడ చెప్పుకోండి నేను ఇలానే మాట్లాడతాను. నన్ను ఎవరు ఏమీ పీకలేరు అంటూ నానా దుర్భాషలాడుతూ కార్మికులను వేధిస్తూ అవహేళనగా మాట్లాడుతున్నాడు. భరించేది లేక కార్మికులు ఆందోళనకు దిగారు. మోసిన్ ఆలస్యంగా అండర్ గ్రౌండ్కు దిగడం డ్యూటీ చివరి సమయంలో పని చెప్పడం, పనులు మార్చడం ఇదేందని అడిగితే నా ఇష్టం నేను ఎవడు చెప్పిన వినను మీరు చేయకపోతే మీ సంగతే చూస్తానని బెదిరిస్తున్నాడని తెలిపారు,

కార్మికుల ప్రధాన డిమాండ్ :ఎస్సార్ పి త్రీ ఉద్యోగులు మోసిన్ ఓవర్మెన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ దగ్గరికి రావాల్సిందే, అవమానపరిచిన ఉద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిందేనని , భేషరతుగా క్షమాపణ చెప్తే తప్ప ఆందోళన విరమించేది లేదని ఓవర్ మెన్ ను జెనరల్ షిఫ్ట్ నుండి తియ్యాలని యాజమాన్యానికి కార్మికులు తెలియచేశారు. మోసిన్ రావాలి క్షమాపణ చెప్పాలి అనే నినాదాలతో ఎస్ఆర్పి త్రీ గని ప్రాంగణం మారు ఓవర్మేన్ మోగింది. తీవ్రమైన ఆందోళనను దృష్టిలో పెట్టుకొని గని మేనేజర్ గారు రెండు రోజులలో మీ సమస్యను పరిష్కరిస్తాను నా మాట వినండి అని గని కార్మికులను కోరారు. మేనేజర్ గారి పైన విశ్వాసంతో ప్రస్తుతం తాత్కాలికంగా ఆందోళనను విరమిస్తున్నామని గని కార్మికులు తెలియజేశారు. మీరిచ్చిన హామీ అమలు జరగకపోతే భారీ ధర్నాతో పాటు తీవ్ర ఆందోళనలు ఉంటాయని మేనేజర్ గారికి కార్మికులు తెలియజేశారు.

ఈ ఆందోళన కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటియుసి గుర్తింపు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, పిట్ కార్యదర్శి మురళి చౌదరి, పిట్ ఉపాధ్యక్షులు తౌటం మల్లేశ్, సహాయ కార్యదర్శి కారుకూరి నగేశ్, సేఫ్టీ కమిటీ మెంబర్లు నరేష్, కంది శ్రీనివాస్, సాగర్ నాయకులు మహేష్, రమేష్, రాజయ్య ,భోగి గోపి, బొజ్జ రాజయ్య బాధిత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్యాచరణపై
జరిగింది. ఈ సమావేశంలో సాగునీరు, తాగునీటి భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నాయకులు సూచనలు చేశారు. ఈ...
By Kothuru Murali 2026-04-01 06:00:40 0 151
Andhra Pradesh
మదనపల్లి: మిద్దెపై నుంచి పడి చేనేత కార్మికుడుకి తీవ్ర గాయాలు.
మదనపల్లిలోని నీరుగట్టుపల్లి రామిరెడ్డి లేఔట్‌లో చేనేత కార్మికుడు పాపయ్య (49) మిద్దెపై నుంచి...
By Pagadala Venkateswar 2026-02-07 07:01:02 0 189
Business & Finance
Repair Your Credit Score for Better Loan Approval
Repairing your credit score is essential for improving your financial credibility and increasing...
By Navya Sree 2026-07-20 06:23:23 0 29
Telangana
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ. 2.58కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐపీఎస్ భార్య.|
హైదరాబాద్ : సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐపీఎస్ జేడీ...
By Sidhu Maroju 2026-01-11 17:37:35 0 214
Andhra Pradesh
విజయవాడ పూర్ణానంద పేట శిరిడి సాయిబాబా వార్షికోత్సవ సందర్భంగా హాజరైన వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ  15-04-2026   ప్రచురణార్ధం    పూర్ణానందంపేట శ్రీ షిర్డీ సాయిబాబా...
By Rajini Kumari 2026-04-15 13:07:24 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com