Madanapalle: ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా 'తల్లికి వందనం' అమలు చేసి సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని మదనపల్లె నేత కట్టా దొరస్వామి నాయుడు కొనియాడారు.

0
96

మదనపల్లె: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఒక కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు అర్హులుగా ఉన్నా వారందరికీ 'తల్లికి వందనం' పథకం వర్తింపజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు అన్నారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూలై 22న బుధవారం అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులను నేరుగా జమ చేయడం ద్వారా ప్రభుత్వం విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి పథకం ప్రయోజనం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ విద్యాపట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.

 

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఆర్థిక భరోసాను కల్పిస్తోందని, విద్యార్థులు చదువుల్లో మరింత ముందుకు వెళ్లేందుకు ఇది తోడ్పడుతుందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కట్టా దొరస్వామి నాయుడు ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Telangana
సాయినగర్ సమస్యలపై శాంతి ఆకస్మిక పర్యటన.|
"మురుగు, వేలాడే విద్యుత్ తీగలు, నీటి నిల్వపై స్థానికులతో సమీక్ష" మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :...
By Sidhu Maroju 2026-07-01 09:31:13 0 115
BMA
WhatsApp Networks: The Rise of Unverified Local News
Genuine regional journalism is being actively undermined by the explosive rise of unregulated...
By JoinBMA 2026-08-21 08:13:44 0 150
Chandigarh
Chandigarh to Roll Out Monthly Parking Pass Across the City
In a move towards simplifying city transport and parking, the Chandigarh Municipal Corporation...
By Bharat Aawaz 2025-07-17 06:00:46 0 2K
Telangana
"ఆల్వాల్ అభివృద్ధిపై శాంతి శ్రీనివాస్ రెడ్డి నజర్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ల్లోని పలు బస్తీల్లో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ,...
By Sidhu Maroju 2026-04-22 10:25:02 0 341
Andhra Pradesh
పుంగునూరు: పట్టణ పరిధిలో గల పుణ్యమ్మ చెరువులోకి హంద్రీనీవా జలాలు: మరవ వద్ద గ్రామస్తుల ఏర్పాట్లు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని 50 రాళ్ల మరవ వద్ద ఆదివారం గ్రామస్తులు ఏర్పాట్లు...
By Kothuru Murali 2026-02-08 10:30:13 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com