"ఆల్వాల్ అభివృద్ధిపై శాంతి శ్రీనివాస్ రెడ్డి నజర్.|

0
340

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ల్లోని పలు బస్తీల్లో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అధికారులను కోరారు.

బుధవారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజను ఆమె కార్యాలయంలో కలిసి క్షేత్రస్థాయి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. 

ముఖ్యంగా లక్ష్మీ నగర్ (లోత్ కుంట), ఇంద్రానగర్, భీమ్ రావు నగర్, ఎంఈఎస్ కాలనీ, ప్రశాంత్ నగర్, బండబస్తీ, వెంకట్రావు పేట మరియు స్టేషన్ బస్తీ ప్రాంతాల్లో ఇప్పటికే మంజూరైన పనులు నత్తనడకన సాగుతుండటంపై శాంతి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పనుల జాప్యం కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పౌర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. మంజూరైన ప్రతి పనిని తక్షణమే పట్టాలెక్కించి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా పూర్తి చేయాలని ఈడీని కోరారు. 

దీనిపై సానుకూలంగా స్పందించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షించి, జాప్యాన్ని నివారించేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పెండింగ్ పనులన్నింటినీ త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆమె భరోసా ఇచ్చారు.

#sidhumaroju

Alwal

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీశైలం మల్లికార్జున ఉత్సవాలకు నారా లోకేష్ కు ఆహ్వానం
*శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం*   ఉండవల్లి:...
By Rajini Kumari 2026-02-07 11:54:47 0 192
SURAKSHA
Drug Crackdown: Goa Police Arrests 150+ Peddlers
Goa Police Anti-Narcotics Cell works 24x7 to make Goa drug-free. Special raids at beaches, clubs...
By Kalaga Sailaja 2026-07-03 07:02:19 0 354
Fashion & Beauty
Parul Gulati on Fashion, Beauty, and Her Dream Cannes Debut: ‘It’s Not About Standing Out, It’s About Being Me’
Parul Gulati on Fashion, Beauty, and Her Dream Cannes Debut: ‘It’s Not About Standing...
By BMA ADMIN 2025-05-21 13:58:13 0 3K
Andhra Pradesh
వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ వారి సేవ స్ఫూర్తి
వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్  ఆకలితో ఉన్న చిన్నారులకు,...
By Rajini Kumari 2025-12-28 10:21:43 0 203
Andhra Pradesh
అమరావతి రాజాధానిపై బొబ్బిలిలో సంబరాలు
రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించినందుకు గురువారం బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యోగులు...
By Boiena Rajesh 2026-04-03 00:53:49 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com