Madanapalle: ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా 'తల్లికి వందనం' అమలు చేసి సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని మదనపల్లె నేత కట్టా దొరస్వామి నాయుడు కొనియాడారు.

0
97

మదనపల్లె: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఒక కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు అర్హులుగా ఉన్నా వారందరికీ 'తల్లికి వందనం' పథకం వర్తింపజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు అన్నారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూలై 22న బుధవారం అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులను నేరుగా జమ చేయడం ద్వారా ప్రభుత్వం విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి పథకం ప్రయోజనం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ విద్యాపట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.

 

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఆర్థిక భరోసాను కల్పిస్తోందని, విద్యార్థులు చదువుల్లో మరింత ముందుకు వెళ్లేందుకు ఇది తోడ్పడుతుందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కట్టా దొరస్వామి నాయుడు ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ముస్లిం పేద విద్యార్థులకు ఉచిత విద్య
*ప్రెస్ నోట్*   8-5-26   *పేద ముస్లిం విద్యార్థులను మేం చదివిస్తాం*    ...
By Rajini Kumari 2026-05-08 13:35:40 0 140
Andhra Pradesh
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలో NTR మెమోరియల్ టోర్నమెంట్ 2026 ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలో NTR మెమోరియల్ టోర్నమెంట్ 2026 ఆధ్వర్యంలో...
By Chennaiah Kati 2026-01-19 16:31:31 0 374
Telangana
ఉద్యమ సహచరుడు, సోదరుడు, మంచి మనసున్న మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింది.హరీష్ రావు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మృత్యువును జయించి తిరిగి వస్తారనే ఆశతో మనమంతా ఎదురుచూశాం....
By Ponnala Srinivasrao 2026-07-31 02:31:22 0 161
Andhra Pradesh
మదనపల్లెలో రాస్తారోకో - 30 మందికి 41 నోటీసులు జారీ.
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్యకు నిరసనగా రాస్తారోకో నిర్వహించిన 30 మందికి డీఎస్పీ మహీంద్ర గురువారం...
By Pagadala Venkateswar 2026-02-20 06:29:59 0 187
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:టమోటా లోడ్ ట్రక్ బోల్తా
సోమల చౌడేపల్లి మార్గంలో టమోటా లోడ్ తో వెళ్తున్న ట్రక్ శుక్రవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో...
By Kothuru Murali 2026-03-20 06:34:17 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com