నారాయణపేట జిల్లాలో దారుణ 

0
183

భరత్ అవాజ్ 

సూర్యమోహన్ 

 

 

 

నారాయణపేట జిల్లాలో దారుణ 

 

ఘటన వెలుగుచూసింది నగల కోసం ఓ మహిళను దుండగులు హత్య చేశారు

 పది రోజుల క్రితం అదృశ్యమైన ఆ మహిళ విగతజీవిగా కనిపించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలకలాన్ని రేపింది

 

 

పోలీసుల వివరాల ప్రకారం మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాదరవ్ పల్లి గ్రామానికి చెందిన శాంతమ్మ అనే మహిళ పది రోజుల క్రితం అదృశ్యమైంది

 

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లోనే పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు

 

ఈ క్రమంలో నిన్న సాయంత్రం నారాయణపేట మండలం జాజపూర్ గ్రామ శివారులోని ఓ చెరువు సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు

నగల కోసమే హత్య 

 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు మృతురాలి ఒంటిపై ఉండాల్సిన బంగారు, వెండి నగలు కనిపించకపోవడంతో కేవలం ఆ నగల కోసమే దుండగులు ఆమెను దారుణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పోలీసుల అదుపులో నిందితులు 

 

కాగా ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత హత్య ఎలా జరిగింది

 ఎంతమంది పాల్గొన్నారు

 తదితర పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు

Search
Categories
Read More
Andhra Pradesh
పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందించిన కాసిం, ఈశ్వర్
పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందించిన కాసిం, ఈశ్వర్ పెద్దారవీడు మండలం ...
By Chennaiah Kati 2026-03-14 06:12:45 0 392
Andhra Pradesh
వన్ మంత్ - వన్ విలేజ్ కార్యక్రమంలో ఆర్డిఓ అనిల్ కుమార్
నందిగామ మండలం పల్లగిరి గ్రామ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్...
By Patan Khuddus 2026-05-07 11:00:28 0 317
Andhra Pradesh
Chittoor: చిత్తూరు మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ నివాసానికి వెళ్లి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్. ఆయన కుటుంబానికి పార్టీ తరఫున పూర్తి అభయం.
Chittoor: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన చిత్తూరుకు చెందిన మాజీ కార్పొరేటర్ వసంత కుమార్...
By Pagadala Venkateswar 2026-09-07 10:34:32 1 667
SURAKSHA
K. Sharta Chandra Pawar: The Guardian of Order and Resolve
The Guardian of OrderThe Guardian of Order: The Unwavering Resolve of IPS K. Sharta Chandra Pawar...
By Kalaga Sailaja 2026-07-11 06:45:19 0 128
Telangana
మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష
మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష   రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు గారి...
By Pinnehasan Odela 2026-04-08 13:24:27 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com