కేంద్ర విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించకపోతే, అది మీ రాజీనామా డిమాండ్ వరకు వస్తుందని వార్నింగ్...అభిజీత్ దీప్కే

0
187

కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ తాజా హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించకపోతే, అది మీ రాజీనామా డిమాండ్ వరకు వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ‘‘మోదీ జీ.. మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించండి. లేదంటే ఈ ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మాత్రమే పరిమితం కాదు.. మీ రాజీనామాను కూడా డిమాండ్ చేసే దిశగా వెళ్తుంది’’ అని దీప్కే అన్నారు.

‎దేశంలో కోట్లాది మంది విద్యార్థుల కన్నా ఒక అసమర్థ, విఫల మంత్రి ముఖ్యం కాదని, అలాంటి మంత్రిని విద్యార్థుల కన్నా ముఖ్యుడని భావిస్తే, రాబోయే ఎన్నికల్లో ప్రజలు మీకు ఓటు వేయరని గుర్తుంచుకోండి అని వ్యాఖ్యానించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని, పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ బాధ్యత వహించాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది.ఇదిలా ఉంటే, సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపింది. చర్చలకు ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. జేపీ నడ్డా కార్యాలయం లేదా నివాసంలో చర్చలకు మీకు వీలైన సమయంలో సిద్ధంగా ఉన్నామని అన్నారు. మరోవైపు, తాము ఎక్కడికి రాబోమని ప్రభుత్వమే జంతర్ మంతర్ వచ్చి చర్చలు జరపాలని సీజేపీ డిమాండ్ చేస్తుంది. జంతర్ మంతర్ లేదా కానిస్ట్యూషన్ క్లబ్ లాంటి తటస్థ వేదికలపై చర్చలకు సిద్ధమే అని ప్రకటించింది. చర్చలు జరగాలంటే ముందుగా కేంద్రమంత్రిని తొలగించాలని షరతు విధిస్తోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 85. 65 కోట్ల ఆదాయం: డీఐజీ.
మదనపల్లె రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 85.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు డీఐజీ రామలక్ష్మీ పట్నాయక్...
By Pagadala Venkateswar 2026-06-07 13:05:51 0 111
Telangana
జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నాయకుడు అరెస్టు.|
    హైదరాబాద్ : రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేశాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ...
By Sidhu Maroju 2026-01-07 06:52:23 0 259
Telangana
గాంధీ ఆసుపత్రిలో యువతికి అరుదైన ఆపరేషన్ .|
       హైదరాబాద్ : (భారత్ ఆవాస్ ప్రతినిధి)  ఆసిఫాబాద్ కు చెందిన...
By Sidhu Maroju 2026-01-21 09:53:45 0 223
Telangana
తనయుడి పుట్టినరోజు సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
    కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తనయుడు ముకుల్ పుట్టిన రోజు సందర్భంగా న్యూ బోయిన్...
By Sidhu Maroju 2025-06-30 17:32:37 0 1K
Telangana
షాలోమ్ చర్చి సేవలు అభినందనీయం - అనిల్ కిషోర్ గౌడ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భూదేవినగర్: స్థానిక షాలోమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి ఆధ్వర్యంలో ఆనంద్...
By Sidhu Maroju 2026-03-15 12:13:34 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com