విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోడి

0
1K

గుజరాత్ లోని అహ్మదాబాద్, విమానాశ్రయం నుండి టేకప్ అయిన కొద్దిసేపటికే లండన్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానం గురు వారం మధ్యాహ్నం ఏఐ -171 కుప్పకూలింది, ఈ ఘటనలో దాదాపు 265 మంది మరణించారు. అందులో ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు ఈ ప్రమాదం దశాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా అధికారులు వర్ణిస్తున్నారు.ఎయిరిండియా విమానం కూలిన ఘటన యావత్ భారత దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం 229 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఫ్లైట్ బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్‌పై పడటంతో మరో 24 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ,ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు కాసేపటి క్రితం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రమాదం జరిగిన మేఘాని నగర్‌ ఘోడాసర్‌ క్యాంప్‌ ప్రాంతానికి వెళ్లారు. ప్రధాని తో పాటు ఆయన వెంట కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు 

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్ లో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు.|
హైదరాబాద్ : గ్లోబల్ సమ్మిట్ వేళ కీలకనిర్ణయాలు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సందర్బంగా ప్రభుత్వ...
By Sidhu Maroju 2025-12-07 15:50:52 0 89
Andhra Pradesh
అదే జోరు అదే హోరు నాలుగో మండలం గూడూరు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం సూపర్ హిట్
గూడూరు నలుమూలల నుంచి కదిలిన జనసేన కార్యకర్తలు ప్రజానేత సంధ్య విక్రమ్ కుమార్ కు జననీరాజనాలు...
By mahaboob basha 2025-07-14 04:01:15 0 980
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com