దర్శి ప్రజలకు త్వరలో క్రీడా ప్రాంగణం అంకితం

0
225

దర్శి ప్రజలకు త్వరలో క్రీడా ప్రాంగణం అంకితం

రూ.2.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న క్రీడా వికాస కేంద్రం (ఇండోర్ స్టేడియం) మరియు క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి పనులను దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, యువనేత డా కడియాల లలిత్ సాగర్ గారు , శాప్ చైర్మన్ రవి నాయుడు గారుతో కలిసి పర్యవేక్షించారు.

దర్శి పట్టణ ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ఇండోర్ స్టేడియం త్వరలో అందుబాటులోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ క్రీడా ప్రాంగణం ఒక గొప్ప వేదికగా నిలవనుంది.

యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం ద్వారా వారి శారీరక, మానసిక వికాసానికి తోడ్పడటంతో పాటు, దర్శి నియోజకవర్గాన్ని క్రీడా రంగంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, క్రీడా మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారు, శాప్ చైర్మన్ శ్రీ రవి నాయుడు గారి సహకారంతో ఈ క్రీడా ప్రాంగణం అభివృద్ధి చెందడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు తెలిపారు.

గత ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను తిరిగి ముందుకు తీసుకెళ్లి, దర్శి నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

అనంతరం శివరాజ్ నగర్‌లోని క్రికెట్ గ్రౌండ్‌ను కూడా సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు.

క్రీడలకు ప్రోత్సాహం యువతకు బంగారు భవిష్యత్తు దర్శి అభివృద్ధే లక్ష్యం

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీకాకుళం: బీసీ సంక్షేమ శాఖ అధికారిపై వేటు?
శ్రీకాకుళం బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధపై వేటుపడినట్లు సమాచారం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ...
By Manda Ramkumar 2026-03-28 13:22:07 0 629
Andhra Pradesh
పౌర్ణమి సందర్భంగా కోనేటిరాయునికి పుంగనూరులో గరుడ సేవ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి టిటిడి...
By Kothuru Murali 2026-01-04 10:57:34 0 225
Andhra Pradesh
పులిచెర్ల: ఊపిరి పీల్చుకున్న రైతులు
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న జంట ఏనుగులు శుక్రవారం పాకాల మండలంలోని...
By Kothuru Murali 2026-01-31 11:10:00 0 213
Andhra Pradesh
కాలువపై శివాజీ విగ్రహం ఏర్పాటు సబబు కాదు: వాల్మీకి సంఘాల.
మదనపల్లె బహుదా కాలువపై ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సబబు కాదని వాల్మీకి సంఘాల నాయకులు...
By Pagadala Venkateswar 2026-06-27 05:49:34 0 88
Andhra Pradesh
అమరావతికి చట్టబద్ధత: టీడీపీ నాయకుల సంబరాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ నాయకులు గురువారం మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు కోళ్ల బైళ్ళు...
By Pagadala Venkateswar 2026-04-03 05:54:01 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com