ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు. స్వయంగా పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్

0
272

ఆసిఫాబాద్ పట్టణంలోని దస్నాపూర్ వార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించారు. ఈ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్ గారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీలలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు ఫాగింగ్ పనులను వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని, ప్రజలు ఇళ్లలోని చెత్తను రోడ్లపై వేయకుండా మున్సిపల్ వాహనాలకే అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
శ్రీగణేష్ జోక్యంతో సద్దుమణిగిన అంబేద్కర్ విగ్రహ వివాదం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మారేడ్‌పల్లి వాల్మీకి నగర్‌లో అంబేద్కర్ విగ్రహంపై నెలకొన్న...
By Sidhu Maroju 2026-04-13 08:58:10 0 203
Andhra Pradesh
నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం.
అన్నమయ్య జిల్లా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్య కోసం...
By Pagadala Venkateswar 2026-05-22 05:02:29 0 117
Andhra Pradesh
రేపటి నుంచి భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు
రేపటి నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సేవలు ప్రారంభం కానున్నాయి....
By Boiena Rajesh 2026-08-16 03:30:01 0 92
Telangana
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  అల్వాల్ సర్కిల్‌ వెంకటాపురం‌లో ప్రజా పాలన దినోత్సవంలో...
By Sidhu Maroju 2025-09-17 09:58:40 0 323
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీ విద్యార్థులకు ఊరట.. ఫీజు బకాయిలకు లైన్ క్లియర్.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు మార్గం సుగమం వడ్డీ కోత ప్రతిపాదనను తిరస్కరించిన...
By Pagadala Venkateswar 2026-03-13 07:37:18 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com